Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

Advertiesment
Vishwaksen, S Radhakrishna, Talasani Srinivas Yadav, Allu Aravind

దేవీ

, సోమవారం, 12 మే 2025 (09:30 IST)
Vishwaksen, S Radhakrishna, Talasani Srinivas Yadav, Allu Aravind
మాస్ కా దాస్ విశ్వక్సేన్ ఇప్పటికే ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ సినిమాలతో దర్శకుడు, నిర్మాత, రచయితగా తన ప్రతిభను చాటారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ #CULT కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను తారక్ సినిమాస్,  వన్మయే క్రియేషన్స్ బ్యానర్లపై కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విశ్వక్సేన్ దర్శకుడిగానే కాదు కథ కూడా స్వయంగా రాసుకున్నారు. 40 మంది న్యూ కమ్మర్స్ ని పరిచయం చేస్తూ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది.
 
న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్‌గా, వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న #CULT ట్రెడిషనల్ ఫార్ములాలను చెరిపేసేలా ఉంది. ఈ సినిమా పోస్టర్‌లో గోట్ మాస్క్ ధరించిన ప్రొటగనిస్ట్,  వైబ్రెంట్ బ్యాక్ డ్రాప్, కంటైనర్లు కనిపించాయి. ఇవి సినిమా యూనిక్ నెస్ ని సూచిస్తున్నాయి. ఈ సినిమా ఆడియన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
 
ఈ సినిమా రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ కార్యక్రమానికి కోర్ టీమ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎస్ రాధాకృష్ణ (చిన్నబాబు) టైటిల్ లోగోను లాంచ్ చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ముహూర్తపు షాట్‌కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ప్రారంభోత్సవంతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా నేడు ప్రారంభమైంది.
 
ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్‌ను అందించగా, KGF, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. సినిమాటోగ్రఫీ అర్వింద్ విష్వనాథన్, ఎడిటింగ్‌ రవి తేజ గిరిజాల, ఆర్ట్ డైరెక్షన్‌ను అర్వింద్ ములే నిర్వహిస్తున్నారు.
 
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా #CULT తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్ , ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భైరవం నుంచి నిజమైన ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ సాంగ్ తో రాబోతున్నారు