అందుకే ప్ర‌భాస్ హైద‌రాబాద్ షిప్ట్ అయ్యాడా!

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (20:53 IST)
Prabhas-7
యంగ్ రెబ‌ల్‌స్టార్‌గా పిల‌వ‌బ‌డే ప్ర‌భాస్ క‌రోనా వ‌ల్ల ముంబై నుంచి ఇటీవ‌లే హైద‌రాబాద్ వ‌చ్చేశాడు. విమానాశ్ర‌యంలో ఆయ‌న వ‌స్తున్న ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. అయితే ఆ త‌రువాత రోజే త‌న బెస్ట్ ప్రెండ్ మ‌ర‌ణించిన‌ట్లు సోష‌ల్‌మీడియాలో పోస్ట్‌చేశాడు. అంటే ఫ్రెండ్ కోసం వ‌చ్చిన‌ట్లు అభిమానుల‌కు అనిపించింది. దానితోపాటు మ‌రో కార‌ణం కూడా వుంది. అదే ఆదిపురుష్ సినిమా కోసం అట‌.
 
వివ‌రాల్లోకి వెళితే, ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన ఇతిహాస గాథ “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూట్ ఇప్పటికే కొంత మేర కంప్లీట్ అయ్యిన సంగతి కూడా తెలిసిందే. అయితే మొదట నుంచి ఈ చిత్రం తాలూకా షూట్ అంతా ముంబై లోనే ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ లో మేకర్స్ భారీ చేంజ్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.
 
కాగా, చిత్ర నిర్మాత‌లు ఈసినిమాను ముంబైలో చేయాలంటే ఇప్ప‌ట్లో ప‌రిస్థితులు అనుకూలించేట్లు లేవ‌ని ఓ ప్ర‌ణాళిక రూపొందించార‌ట‌. ముంబైలో వేసిన సెట్‌లాంటిదే హైద‌రాబాద్లో వేసి షూటింగ్ పూర్తి చేయాల‌ని ప్లాన్‌. దాదాపు మూడు నెల‌ల‌పాటు చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో వుండాల్సి వ‌స్తుంది. అందుకే ముందుగానే ప్ర‌భాస్ వ‌చ్చాడ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నన‌టిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments