Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

దేవీ
శుక్రవారం, 23 మే 2025 (18:28 IST)
Thank You Dear Look Unveiled by Tammareddy Bharadwaja
తెలుగు నటుడు ధనుష్ రఘుముద్రి నటించిన ‘థాంక్ యూ డియర్’ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఘనంగా జరిగింది. ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్‌ను చూసిన తమ్మారెడ్డి, చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ, ఈ సినిమా ధనుష్‌కు మంచి గుర్తింపు తెస్తుందని, యువ బృందానికి ఆశీస్సులు అందజేస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.
 
ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ, ‘థాంక్ యూ డియర్’ తన రెండో చిత్రమని, తమ్మారెడ్డి లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ తమ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్‌లో కీలకమైనదని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రం ధనుష్‌కు గొప్ప పేరు తెస్తుందని, తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం తమకు ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
 
లైన్ నిర్మాత పుణీత్ రెడ్డి మాట్లాడుతూ, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి సినీ పెద్ద ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం సంతోషకరమని, సినిమాను ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని తెలిపారు. ఈ చిత్రం యువతని కచ్చితంగా ఆకట్టుకొని విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
నటి నటులు - హెబా పటేల్ , ధనుష్ రఘుముద్రి , రేఖ నిరోషా, వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ - శ్రీనివాస్ నాయుడు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments