Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Advertiesment
Matru team with Tammareddy

దేవీ

, శుక్రవారం, 28 మార్చి 2025 (13:20 IST)
Matru team with Tammareddy
మదర్ సెంటిమెంట్‌ మీద వచ్చిన పాటలన్నీ ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. ఇక అమ్మ ప్రేమ మీద టాలీవుడ్‌లో వచ్చిన చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మదర్ సెంటిమెంట్‌ను బేస్ చేసుకుని ‘మాతృ’ అనే సినిమా రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద శ్రీ పద్మ సమర్పణలో  బి. శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మాతృ’. రా రాజా చిత్రంతో బి. శివ ప్రసాద్ తనలోని దర్శక, నిర్మాతను అందరికీ పరిచయం చేశారు.

ఇప్పుడు మాతృ సినిమాను నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నారు. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు. 
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు గుండెల్ని కదిలిస్తున్నాయి. మనసు తాకే పాటల్ని విడుదల చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరో ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నారు. తల్లి కోసం పడే వేదనను చూపించేలా ఈ ‘చూస్తున్నవేమో’ అన్న పాటను కంపోజ్ చేశారు. శేఖర్ చంద్ర బాణి, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, కారుణ్య గానం ఈ పాటను పదే పదే వినాలనిపించేలా చేస్తోంది. జాతీయ అవార్డు సాధించిన సుద్దాల అశోక్ తేజ రచించిన లిరిక్స్ గుండెల్ని హత్తుకునేలా ఉన్నాయి. ఇక కారుణ్య గాత్రంలోని ఆ ఆర్ద్రత శ్రోతల గుండెల్ని తాకేలా ఉంది.
 
ఇక ఇలాంటి గొప్ప పాటను తాజాగా దర్శక, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ్ మెచ్చుకున్నారు. హృదయాన్ని హత్తుకునేలా ఉన్న ఈ పాటను ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం మదర్ సెంటిమెంట్ మీద సినిమాలు అంతగా రావడం లేదని, తల్లి ప్రేమను చాటే పాటలు కూడా రావడం లేదని ఆయన అన్నారు. మాతృ టీంను అభినందిస్తూనే ఆల్ ది బెస్ట్ తెలిపారు.
 
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది. ఈ క్రమంలోనే ఇలా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు. మాతృ టైటిల్‌కు తగ్గట్టుగా పాటల్ని రిలీజ్ చేస్తూ అందరినీ కదిలిస్తున్నారు. ప్రస్తుతం మాతృ సినిమాలోని పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.
 
ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్‌గా, సత్యనారాయణ బల్లా ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
 
తారాగణం : శ్రీరామ్, నందిని రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్, అలీ, ఆమని, కాలే రవి, దేవి ప్రసాద్, పృధ్వి తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ