ఐపీఎల్ 18వ సీజన్ పోటీల్లో భాగంగా, గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోవడంతో ఓడిపోయింది. ప్రత్యర్థి లక్నో సూపర్ జైంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు కనీసం 200 పరుగులు కూడా చేయలేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీంతో సొంతగడ్డపై ఓటమిని మూటగట్టుకుని అభిమానులను నిరాశపరిచింది.
ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల బ్యాటింగ్ తీరు చూస్తే అభిషేక్ శర్మ (6) మ్యాచ్ ఆరంభంలోనే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బంతికే ఇషాన్ కిషన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే సూపర్బ్ సెంచరీ చేసిన ఇషాన్.. ఈ మ్యాచ్‌లో డకౌట్ కావడం అభిమానులను తీవ్రంగా నిరుత్సాపరిచింది.
మరో ఎండ్‌లో ఉన్న ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడి 28 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 47 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి 32, హెన్రిచ్ క్లాసెస్ 26 పరుగులు చేయగా భారీ స్కోర్లు సాధించలేకపోయారు.
ఈ దశలో అనికేత్ వర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లోనే చకచకా 36 పరుగులు చేశాడు. అనికేత్ ఏకంగా 5సిక్స్‌లు బాదడం విశేషం. అటు కెప్టెన్ ప్యాట్ కమిన్సన్ కేవలం 4 బంతుల్లో 18 పరుగులు చేయగా, ఇందులో మూడు సిక్స్‌లు ఉన్నాయి. ప్రత్యర్థి లక్నో జట్టులో శార్ధూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో రాణించగా, అవేష్ శాన్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ ఒక్కో వికెట్ చొప్పున రాణించారు.