Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Advertiesment
Sampoornesh Babu

దేవీ

, శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (18:11 IST)
Sampoornesh Babu
"హదయ కాలేయం" సినిమాతో బర్నింగ్ స్టార్ గా ప్రేక్షకుల అభిమానం పొందారు సంపూర్ణేష్ బాబు. దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన ఈ సినిమా 11 ఏళ్ల కిందట రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా 11 వ యానివర్సరీ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడారు.
 
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ - సినిమా కల సాకారం చేసుకునేందుకు వందలాది మంది ప్రయత్నిస్తుంటారు. వారిలో నాకు ఒకరిగా అవకాశం, గుర్తింపు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. నరసింహా చారిగా చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నన్ను హృదయకాలేయం సినిమాతో సంపూర్ణేష్ బాబుగా మార్చారు సాయి రాజేశ్ అన్న. ఆయనకు రుణపడి ఉంటాను. సాయి రాజేశ్ అన్న, ఆయన అమృత ప్రొడక్షన్స్ నాకు ఎప్పుడూ అండగా ఉంటాయి. సాయి రాజేశ్ అన్న కొంత టైమ్ పట్టినా నాతో మూవీ చేస్తా అన్నారు. హృదయ కాలేయం రిలీజ్ టైమ్ లో దర్శకులు రాజమౌళి గారు చేసిన ట్వీట్ వల్ల నాకు ఎంతో గుర్తింపు దక్కింది. 
 
ఎప్పుడు కలిసినా రాజమౌళి గారు సంపూ ఎలా ఉన్నావు అని పలకరిస్తారు. ఆయన సినిమాలో అవకాశం వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. హృదయ కాలేయం టైమ్ లో సందీప్ కిషన్ అన్న, మారుతి గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు ఎంతో సపోర్ట్ చేశారు. 11 ఏళ్లయినా ఇప్పటికీ హృదయ కాలేయం సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. ఈ 11 ఏళ్లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాను. త్వరలో సోదరా అనే మూవీతో మీ ముందుకు రాబోతున్నా. ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కు వస్తోంది. మరో రెండు సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. కామెడీతో పాటు సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేయాలని అనుకుంటున్నా. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలామంది ఆ షోలో ఉంటే బాగుండేది కదా అన్నారు.

కానీ నా లైఫ్ స్టైల్ కు అక్కడి పరిస్థితికి సరిపోక ఉండలేకపోయాను. నా సంపాదనలో కొంత ఛారిటీకి ఇవ్వడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండను. ఎవరైనా విమర్శించినా వాటిని సీరియస్ గా తీసుకోను. కనీసం కారులో తిరగగలనా అని అనుకున్న నన్ను హృదయ కాలేయం సినిమా, సాయి రాజేశ్ అన్న ఇచ్చిన అవకాశం వల్ల ఫ్లైట్స్ లో తిరిగాను. త్వరలో మరిన్ని మంచి మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది