Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో ఈ శుక్రవారం 10 సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి..

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (16:54 IST)
టాలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాలు ఏ పండుగకో గానీ రిలీజు కావు, ఒక్కోసారి వేసవిలో విడుదలవుతుంటాయి. కానీ చిన్న సినిమాలు అలా కాదు. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు రిలీజుకు రెఢీ అయిపోతుంటాయి.


బడా హీరోల నడుమ రిలీజైతే వీటిపై కలెక్షన్‌ల పరంగా పెద్ద ప్రభావం పడుతుంది కాబట్టి ఎప్పుడు థియేటర్లు ఖాళీగా ఉంటే, అప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా వీకెండ్ కలెక్షన్‌లను దృష్టిలో ఉంచుకుని సినిమాలు ఎప్పుడూ శుక్రవారం నాడు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. 
 
ఈ శుక్రవారం టాలీవుడ్‌ బాక్సాఫీస్ ముందు చిన్న సినిమా పండుగ జరగనుంది. పెద్ద హీరోల చిత్రాలు బరిలో లేకపోవటంతో, నెలాఖరున 'సాహో' మేనియా మొదలవుతుండటంతో చిన్న సినిమాలన్నీ ఆగస్టు 23న రిలీజ్‌కు క్యూ కట్టాయి. దీంతో ఒకే రోజు 10 సినిమాలు బాక్సాఫీస్‌ బరిలో తలపడుతున్నాయి. అయితే వీటిలో ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతా సినిమాలు రిలీజ్‌ అవుతున్నట్టుగా కూడా ప్రేక్షకులకు తెలియకపోవడం ఆశ్చర్యం.
 
తమిళంలో విజయవంతమైన అయిన కనా సినిమాను తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి పేరుతో రీమేక్‌ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపై కాస్త అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు బాయ్‌, ఉండిపోరాదే, నివాసి, హవా లాంటి సినిమాల సందడి మీడియాలో కాస్త కనిపిస్తుంది. 
 
నేనే కేడీ నెం 1, జిందా గ్యాంగ్‌, నీతోనే హాయ్‌ హాయ్‌, కనులు కనులు దోచేనే విషయంలో ఆ సందడి కూడా కనిపించటం లేదు. వీటిలో కౌసల్య కృష్ణమూర్తి చిత్రం మినహా మిగతా అన్ని చిత్రాలు ప్రచారంలో కూడా వెనుకబడి ఉన్నాయి. ఈ చిత్రాల్లో ఏవేవి విజయం సాధిస్తాయో తెలియాలంటే ఈ వారాంతం వరకు వేచి చూడాల్సిందే మరి..

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments