బిగ్ బాస్ రియాల్టీ షో రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో ఎప్పుడూ నవ్విస్తూ వుండే బాబా భాస్కర్ కన్నీరు పెట్టుకున్నాడు. నామినేషన్ సందర్భంగా హౌస్‌మేట్స్ తనపై చేసిన ఆరోపణలు భాస్కర్‌ను బాధించాయి.
తాను ఎప్పుడూ ఒకలాగే ఉంటానని, బిగ్‌బాస్ షో కోసం నటించాల్సిన పనిలేదని తెలిపాడు. తనను నామినేట్ చెసేందుకు అలీ చెప్పిన కారణం తనను బాధించిందని శ్రీముఖికి చెబుతూ వెక్కివెక్కి ఏడ్చాడు. తాను అందిరితోనూ ఒకేలా ఉంటానని చెప్పాడు.
ఇకపోతే.. బిగ్ బాస్ హౌజ్‌లో వున్న పోటీదారులు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా ఎక్కువమంది రాహుల్‌ను నామినేట్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో హిమజ నిలిచింది. మొత్తంగా ఈ వారంలో రాహుల్, హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.