Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ‌హేష్ - బ‌న్నీతో పోటీకి సై అంటున్న నంద‌మూరి హీరో

మ‌హేష్ - బ‌న్నీతో పోటీకి సై అంటున్న నంద‌మూరి హీరో
, మంగళవారం, 20 ఆగస్టు 2019 (12:59 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు "స‌రిలేరు నీకెవ్వ‌రు", స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ "అల... వైకుంఠ‌పురంలో.." చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు ఈ రెండు చిత్రాల‌తో పోటీకి సై అంటున్నాడు నంద‌మూరి హీరో. ఇంత‌కీ ఎవ‌రా నంద‌మూరి హీరో అనుకుంటున్నారా..? "118"తో సూపర్ డూపర్ హిట్ సాధించిన నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం "ఎంత మంచివాడ‌వురా". ఇందులో మెహరీన్ కథానాయిక .శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్‌) లిమిటెడ్‌ నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త‌ నిర్మాత‌లు. ‘శతమానం భవతి ‘చిత్రంతో నేషనల్ అవార్డు గెలుచుకున్న స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణకు సిద్ధమవుతుంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత‌ ఉమేష్ గుప్త మాట్లాడుతూ, 'కల్యాణ్‌రామ్‌, సతీశ్ వేగేశ్న కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'ఎంత మంచివాడవురా' టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు మాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అదే పాజిటివ్ వైబ్స్‌తో అనుకున్న ప్లానింగ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. 'గీత గోవిందం', 'మజిలీ' తదితర బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన గోపీసుందర్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు అందిస్తున్నారు. 
 
జూలై 31న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. ఆగస్ట్ 17నాటికి తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఆగస్ట్ 26 నుండి సెప్టెంబర్ 22 వరకు రెండో షెడ్యూల్‌ను తణుకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నాం. ఇందులో ప్రధాన తారాగణమంతా పాల్గొంటారు. రెండు యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు కీలక సన్నివేశాలు, ఒక పాటను చిత్రీకరించబోతున్నాం. అక్టోబరులో హైదరాబాద్‌లోనూ, నవంబర్ నెలలో చిక్‌మంగళూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ మెప్పించే సినిమాగా తీర్చిదిద్ది సంక్రాంతికి విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. 

ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ, ఒక మంచి కథ, ఒక మంచి హీరో, ఒక మంచి టీం, ఒక మంచి ఫీల్‌తో ఈ సినిమా చేస్తున్నాం. ఇటీవలే దిగ్విజయంగా తొలి షెడ్యూల్‌ పూర్తి చేశాం. రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతున్నాం. టైటిల్‌ని బ‌ట్టి హీరో కేర‌క్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. సో... సంక్రాంతి పోటీకి రెడీ. మ‌రి... మ‌హేష్‌, బ‌న్నీల‌తో పోటీ ప‌డి ఈ నంద‌మూరి హీరో వ‌ర‌కు స‌క్స‌స్ సాధిస్తాడో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తె ఆటలు ఆడుకుంటున్న స్టైలిష్ స్టార్