Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రగంటికి పితృవియోగం.. సాహితీవేత్త శ్రీకాంత్ శర్మ ఇకలేరు

Webdunia
గురువారం, 25 జులై 2019 (11:44 IST)
టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తండ్రి శ్రీకాంత్ శర్మ ఇకలేరు. ఆయన గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 75 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన శ్రీకాంత్ శర్మ... హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఈయన ప్రముఖ కమి, సాహితీవేత్తగా గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. 
 
ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ 1944 మే 29న తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో జన్మించారు. ఈయన 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరి రెండు దశాబ్దాల పాటు సేవలు అందించారు. అనేక లలిత గేయాలు, కవితలు, సాహిత్యవ్యాసాలతోపాటు రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలను రచించారు. 
 
అలాగే, పలు పత్రికల్లో ఉప సంపాదకుడిగా పని చేశారు. పలు తెలుగు సినిమాల్లో పాటలు రాశారు. ‘కృష్ణావతారం’, ‘నెలవంక’, ‘రావుగోపాలరావు’, ‘రెండుజెళ్ల సీత’, ‘పుత్తడిబొమ్మ’, ‘చైతన్యరథం’ వంటి చిత్రాల్లో శ్రీకాంత శర్మ పాటలు రాశారు. తన కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ సినిమాలోనూ ఆయన పాటను రచించారు. 
 
శ్రీకాంత్ శర్మ 1966లో సుప్రసిద్ధ కథారచయిత్రి జానకీబాలను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. కుమార్తె కిరణ్మయి కూడా డాక్యుమెంటరీ, లఘుచిత్రాలు తీసి అవార్డులు పొందారు. ఈమె మోహనకృష్ణ కంటే పెద్దవారు. కుటుంబం మొత్తం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటోంది. 
 
కాగా, శ్రీకాంత్ శర్మ మృతిపై హీరో నాని స్పందించారు. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆయనొక మేధావి అని, గొప్ప వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అష్టా చమ్మా’ సినిమాను చూసిన తరవాత మోహన్ గారితో పాటు తామందరనీ చూసి ఆయన ఎంత గర్వపడ్డారో ఇప్పటికీ మరిచిపోలేనని అన్నారు. మోహనకృష్ణ గారికి, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టుకు షాక్...

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ఎప్పుడొస్తుందా చూద్దామని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా: అంబటి రాంబాబు (video)

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

స్పేస్ ఎక్స్ విమానంలో భూమికి తిరిగిరానున్న సునీత-విల్మోర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments