Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మతోడు.. ఇకపై అలాంటి వెధవపనులు చేయను : శృతిహాసన్

Advertiesment
అమ్మతోడు.. ఇకపై అలాంటి వెధవపనులు చేయను : శృతిహాసన్
, గురువారం, 25 జులై 2019 (09:20 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతిహాసన్. ఈమె వెండితెరపై హీరోయిన్‌గా పరిచయమై ఈ నెల 24వ తేదీతో పదేళ్లు పూర్తి చేసుకుంది. 2009లో బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్ర "లక్‌"తో ఈమె చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. 
 
ఆ తర్వాత జయాపజయాలతో పనిలేకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. దశాబ్దకాలంపాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగడంపై ఆమె స్పందిస్తూ, ఈ పదేళ్ళ కాలంలో చాలా నేర్చుకున్నాను. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా ఈ ప్రయాణంలో నాలో ఊహించని మార్పులు వచ్చాయి. వ్యాపారంతో ముడిపడిన ఈ సినీ కుటుంబంలో మంచితో పాటు చెడు ఉంటుంది. 
 
అయినా ప్రతి ఒక్కరూ తమ నమ్మకాలు, ఆశయాల కోసమే పనిచేస్తారు. ఎన్నో అవరోధాల్ని దాటుకొని ఈ రోజును చేరుకోవడం ఆనందంగా ఉంది. నన్ను అభిమానించే వారు గర్వపడేలా ఇకపై మరింతగా కష్టపడి పనిచేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. 
 
వృత్తిపరంగా, వ్యక్తిగతంతా నా లక్ష్యాలను తిరిగి అంచనా వేసుకోవడానికి, కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఏడాది విరామం ఎంతగానో ఉపయోగపడింది. నన్ను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు' అంటూ వ్యాఖ్యానించింది. 
 
ఇటీవల తన లండన్ ప్రియుడుతో తెగదెంపులు చేసుకున్న శృతిహాసన్ ఇపుడు తమిళంలో విజయ్ సేతుపతి సరసన నటిస్తోంది. అలాగే, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె తెలుగులో ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స‌రిలేరు నీకెవ్వ‌రులో... సంగీత న‌టిస్తుందా..?