ఇంద్రగంటితో నానీ ‘వ్యూహం’

బుధవారం, 3 ఏప్రియల్ 2019 (12:53 IST)
టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సాధించుకున్న నేచురల్ స్టార్‌ నానీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే జెర్సీ సినిమా షూటింగ్ పూర్తి చేసేసిన నానీ, త్వరలో విక్రమ్‌ కుమార్ దర్శకత్వం వహించబోయే తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అయితే... ఈ సినిమాతోపాటు... తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తన 25వ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట.
 
మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సుధీర్‌ బాబు మరో హీరోగా నటించనున్నాడని సమాచారం. నానీకి జోడిగా అదితిరావ్‌ హైదరీ నటించనున్న ఈ సినిమా... ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటూ... త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వ్యూహం అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 'రెడ్డిగారి కుర్రోళ్లంతా ఇట్టా రెచ్చిపోతే ఎలాగంటా' : దుమ్మురేపుతున్న పాయల్ (వీడియో)