Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుర్ర హీరోతో జతకలిసిన నాగార్జున హీరోయిన్

Advertiesment
కుర్ర హీరోతో జతకలిసిన నాగార్జున హీరోయిన్
, గురువారం, 25 జులై 2019 (10:23 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. పూర్తి కుటుంబ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సుశాంత్ నివేదా పేతురాజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 
ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ సాగుతోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర కోసం అల‌నాటి అందాల తార టబుని ఎంపిక చేశారు. ఆమె రీసెంట్‌గా టీంతో క‌లిసింది. వీడియో ద్వారా ఈ విష‌యాన్ని తెలిపింది చిత్ర బృందం. 
 
టాప్ ఆర్టిస్ట్‌లు అంద‌రు ఈ చిత్రంలో భాగం అవుతుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ తన సెంటిమెంట్‌ను కూడా వదులుకున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ నిర్వాహకులకు ముందుస్తు బెయిల్...