Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవెంట్ల పేరుతో హీరోయిన్లతో వ్యభిచారం: దోషులుగా నిర్మాత దంపతులు

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (10:23 IST)
అమెరికాలో ఈవెంట్ల పేరుతో హీరోయిన్లను రప్పించి వారితో బలవంతంగా వ్యభిచారం చేయించారన్న కేసులో కోర్టు టాలీవుడ్ నిర్మాత దంపతులను తేల్చింది. 2018 నాటి ఈ కేసులో విచారణ ఇప్పటికి పూర్తి కాగా, జూన్ 24న శిక్ష ఖరారవుతుంది.
 
అయితే అమెరికా చట్టాల ప్రకారం దాదాపు 34 సంవత్సరాలు శిక్షపడే అవకాశముందని అక్కడి న్యాయ నిపుణుల చెప్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. కిషన్, ఆయన భార్య చంద్రలు కొన్ని సినిమాలకు కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు.
 
అమెరికాలో తెలుగు అసోసియేషన్ తరపున ఈవెంట్లు పెడుతున్నామంటూ ఇక్కడి నుంచి హీరోయిన్లు, మోడళ్లు, సీరియల్స్‌లో నటించే యువతులను అట్రాక్ట్ చేస్తారు. వారు అమెరికాలో అడుగుపెట్టగానే పాస్ పోర్టును బలవంతంగా లాగేసుకుంటారు. 
 
చెప్పినట్టు చేయకపోతే పాస్ పోర్టు తిరిగివ్వమంటూ బెదిరిస్తారు. అంతేకాక, పేమెంట్లు ఎగ్గొట్టడంతో పాటు రిటర్న్ విమాన టిక్కెట్లను కూడా బుక్ చేయమని బ్లాక్ మెయిల్ చేసేవారు. ఇలా ముగ్గురు కన్నడ హీరోయిన్లను బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. 
 
తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించేవారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ విషయంలో అమెరికా అధికారులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేయడంతో మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కత్తితో పొడవాలన్నదే ప్లాన్ : ప్రధాన నిందితుడు వాంగ్మూలం

నాగర్ కర్నూల్‌లో భర్త దారుణం- భార్యను అడవిలో చంపి నిప్పంటించాడు

అవినీతికి పాల్పడితే ప్రధాని అయినా జైలుకు వెళ్లాల్సిందే : అమిత్ షా

పాకిస్తాన్ వరదలు- 788 మంది మృతి, వెయ్యి మందికి పైగా గాయాలు (video)

తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments