గుజరాత్ రాష్ట్రంలో ఓ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకి మరో మహిళతో సాగిస్తున్న అక్రమ రాసలీలలను ఆయన భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అదికూడా తన ఇంట్లోనే పరాయి స్త్రీతో శృంగారంలో మునిగితేలుతుండగా గుర్తించి పట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గుజరాత్‌కు చెందిన భరత్ సింగ్ సోలంకి గత యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. పైగా, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కూడా గతంలో పని చేశారు. అయితే, ఆయనకి తన కట్టుకున్న భార్య రేష్మా పటేల్‌తో విభేదాలు చాలాకాలంగా ఉన్నాయి. దీంతో ఆయన భార్యకు దూరంగా ఉంటున్నారు. ఆమె నుంచి విడాకులు కూడా కోరాడు. వీరిద్దరూ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో భరత్ సింగ్ సోలంకికి మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది.
ఈ మహిళతో గుజరాత్ ఆనంద్‌లోని తన బంగ్లాలో భరత్ రాసలీలల్లో మునిగివుండగా రేష్మా పటేల్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ ఆ తర్వాత ఆ మహిళ జట్టు పట్టి బయటకు ఈడ్చుకొచ్చింది. ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసింది. తన ప్రియురాలిపై రేష్మా చేస్తున్న దాడిని భరత్ సింగ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించి వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించలేదు.