Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లై 15 రోజులే.. కాపురానికి వెళ్లనన్న కూతురు.. ఇద్దర్నీ చంపేసిన కిరాతకుడు

Advertiesment
knife
, మంగళవారం, 31 మే 2022 (20:10 IST)
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లైన నెల రోజులు కాకముందే కాపురానికి వెళ్లనని అడ్డం తిరిగిన కూతుర్ని.. భార్యను హతమార్చాడు కిరాతకుడు. ఆపై తాను కూడా గుళికల మందు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
 
వివరాల్లోకి వెళితే.. మహబూబ్​నగర్ జిల్లా జైనల్లీపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య మంగళవారం తెల్లవారుజామున భార్య కళమ్మ, కూతురు సరస్వతిని రోకలిబండతో మోది హత్య చేశాడు. సరస్వతికి ఈనెల 8న మహబూబ్​నగర్ జిల్లా కేంద్రానికి చెందిన వరుడితో వివాహం జరిగింది. 
 
15 రోజుల తర్వాత ఆమె పుట్టింటికి వచ్చింది. తిరిగి కాపురానికి వెళ్లేది లేదని తేల్చి చెప్పేసింది. ఈ విషయంలో తల్లి కళమ్మ సరస్వతికి అండగా నిలవగా కృష్ణయ్య మాత్రం వ్యతిరేకించారు.
 
కాపురానికి వెళ్లాల్సిందేనంటూ పట్టుపట్టాడు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన కృష్ణయ్య తల్లికూతుళ్లిద్దరినీ కర్రతో మోది దారుణంగా హత్య చేశాడు. తాను కూడా విషగుళికలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని బంధువులకు ఫోన్ ద్వారా తెలిపాడు. 
 
ఈ ముగ్గురిని బంధువులు ఆసుపత్రికి తరలించారు. తల్లికూతుళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. కృష్ణయ్య మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐర్లాండ్ దీవుల్లో విహారయాత్రకు వెళ్లి తెలంగాణ యువకుడు మృతి