Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తన భర్త నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే కుమారుడు చనిపోయాడు.. భర్తపై భార్య కేసు

Advertiesment
road accident
, ఆదివారం, 5 జూన్ 2022 (16:27 IST)
తన భర్త నిర్లక్ష్యం డ్రైవింగ్ వల్లే తన కుమారుడు చనిపోయాడంటూ కట్టుకున్న భర్తపై ఓ భార్య కేసుపెట్టింది. తన భర్త కేర్‌లెస్‌గా కారు నడపడం వల్లే కారు ప్రమాదానికి గురైందని, అందువల్ల తన బిడ్డచనిపోయినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటన తెలంగాణాలోని శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన రవీం, రేష్మ అనే దంపతులు ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అశ్యు బేగం, రెహ్మాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
అయితే, శుక్రవారం శంకర్‌పల్లిలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చి తిరిగి తమ ఇంటికి కారులో బయలుదేరారు. అయితే, అర్థరాత్రి సమయంలో రహీం కారును అతివేగంగా నడిపడం వల్ల శంకర్ పల్లి మండలం కచ్చిరెడ్డిగూడ వద్ద కారు ప్రమాదానికి గురైంది. దీంతో రెహ్మాన్ కన్నుమూశాడు. 
 
ఈ ప్రమాదంపై రేష్మ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త అతివేగ డ్రైవింగ్ కారణంగానే కారు ప్రమాదానికి గురైందని, ఆ కారణంగానే తన బిడ్డ చనిపోయినట్టు పేర్కొంది. దీంతో పోలీసులు రహీంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార నిందింతులకు ప్రజాప్రతినిధి ఆశ్రయం