డ్రగ్స్ కేసుల్లో ప్రమేయం.. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" ఫేమ్ అభిషేక్ అరెస్ట్

సెల్వి
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (09:42 IST)
Abhishek
తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్న డ్రగ్స్ సంస్కృతిని అరికట్టేందుకు తెలంగాణ పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా గత కొన్ని నెలలుగా తరచూ దాడులు, అరెస్టులు జరుగుతున్నాయి. తాజాగా టాలీవుడ్ నటుడు అభిషేక్ పలు డ్రగ్స్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
 
దీంతో అభిషేక్‌ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGNAB) అధికారులు గోవాలో అరెస్టు చేశారు. ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలో నమోదైన డ్రగ్స్ సంబంధిత కేసులలో అభిషేక్ ఒక నిందితుడని తెలిసింది. ప్రస్తుతం ఈ కేసుల విచారణ కోర్టులో కొనసాగుతోంది. అయితే అభిషేక్ మాత్రం విచారణకు హాజరుకావడం లేదు. 
 
తనపై ఈ కేసులు నమోదైన తర్వాత అతను గోవాకు వెళ్లి అక్కడ రెస్టారెంట్ నడుపుతున్నట్లు సమాచారం. విచారణకు హాజరు కాకపోవడంతో అభిషేక్‌పై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో టీజీఎన్‌ఏబీ అధికారులు రంగ ప్రవేశం చేసి అభిషేక్‌ ఆచూకీని గుర్తించారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం అభిషేక్‌ను గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు తరలించారు. 2003లో వచ్చిన ఐతే చిత్రంతో అభిషేక్ తొలిసారిగా నటించాడు. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, డేంజర్ వంటి సినిమాల్లో నటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments