Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ అవార్డ్ కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాం: కార్తికేయ2 నిర్మాతలు

TG Vishwaprasad, Chandu Mondeti, Abhishek Agarwal

డీవీ

, శుక్రవారం, 16 ఆగస్టు 2024 (18:34 IST)
TG Vishwaprasad, Chandu Mondeti, Abhishek Agarwal
'కార్తికేయ2 చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడం మా సంస్థకు మైల్ స్టోన్ మూమెంట్''అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ 'కార్తికేయ2' ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు)గా నేషనల్ అవార్డ్  గెలుచుకుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.
 
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. కార్తికేయ2 చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడం మా సంస్థ పీపుల్ మీడియాఫ్యాక్టరీకి మైల్ స్టోన్ మూమెంట్. ఇది మా మొదటి నేషనల్ అవార్డ్. మా అభిషేక్ కి సెకండ్ నేషనల్ అవార్డ్. ఈ సందర్భంగా నిఖిల్ కి థాంక్స్ చెబుతున్నాను. నిఖిల్ మాకు డైరెక్టర్ చందూ మొండేటి గారితో పరిచయం చేశారు. కార్తికేయ2 అభిషేక్, మేము కలసి చేసిన సినిమా. కార్తికేయ2 మొదలుపెట్టినప్పుడే పెద్ద సినిమా అనుకున్నాం. కానీ ఇంత సక్సెస్ వస్తుందని ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులే కాకుండా పాన్ ఇండియాతో యూస్ ఆడియన్స్ అద్భుతంగా ఆదరించారు. ఈ రోజు మైల్ స్టోన్ నేషనల్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా వుంది. మా సంస్థకు ఇది చాలా గొప్ప విషయం. కార్తికేయ3 డెఫినెట్ గా వుంటుంది'అన్నారు.
 
నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. కృష్ణ ఈజ్ ట్రూత్. ఈ రోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డ్ కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా సినిమాలన్నిటికీ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. నిఖిల్ గారు చందూ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు, వారితో మా కొలాబరేషన్ కొనసాగుతుంది' అన్నారు.
 
డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ... కార్తికేయ2 అద్భుత విజయం సాధించినప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యామో ఇప్పుడు అదే ఫీలింగ్ లో వున్నాం. నేషనల్ అవార్డ్ మరింత భాద్యతని పెంచింది. కార్తికేయ3 ఖచ్చితంగా వుంటుంది. ప్రస్తుతం రైటింగ్ లో వుంది. కార్తికేయ2 తర్వాత దానిపై అంచనాలు ఎంతలా పెరిగాయో మాకు తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా కార్తికేయ3 వుంటుంది. నేషనల్ అవార్డ్ రావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. థాంక్ యూ జూరీ మెంబర్స్. జై శ్రీకృష్ణ' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండేల్, పుష్ప 2, గేమ్ చేంజ‌ర్ పోటీగా రాబోతున్నాయి - తాజా అప్ డేట్