Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ ఇష్టానికి వార్తలు రాస్తుంటారు.. సెలెబ్రిటీలం కదా.. భరించాలి : అభిషేక్

Advertiesment
Abhishek Bachchan

ఠాగూర్

, సోమవారం, 12 ఆగస్టు 2024 (18:17 IST)
కొందరు సెన్సేషన్ కోసం ఇష్టమొచ్చిన వార్తలు రాస్తుంటారు. ఈ వార్తలు కొందరి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుంటాయి. ఏం చేద్దాం... మేం సెలెబ్రిటీలం కాబట్టి వాటిని భరించాలి అంటూ తన భార్య ఐశ్వర్యారాయ్‌తో తాను విడాకులు తీసుకున్నట్టు సాగుతున్న ప్రచారంపై బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యానించారు. అభిషేక్ - ఐశ్వర్య రాయ్‌లు విడిపోయారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. 
 
"ఆ విషయం గురించి మీ అందరితో నేను మాట్లాడాల్సింది ఏమీలేదు. దురదృష్టం కొదీ ఈ విషయాన్ని అంతటా వ్యాపించజేశారు. కానీ, మీరు ఇలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు. మీరు కొన్ని కథనాలు రాయాలి కాబట్టి రాశారు. కానీ ఏం ఫర్వాలేదు. మేము సెలబ్రిటీలం కాబట్టి ఆ వార్తలను భవించాల్సి" అని అన్నారు. 
 
కాగా, గత 2007లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2011లో వీరికి ఆరాద్య అనే పాప పుట్టింది. ఈ యేడాది ఏప్రిల్ నెలలో 17వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి ఫోటోలను ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. వివాహానికి ముందు వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. 
 
అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ విషయంపై తెగ ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి కూడా వీరిద్దరూ వేర్వేరుగా హాజరుకావడం ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చాయి. దీనికితోడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గ్రే డైవర్స్‌కు సంబంధించిన పోస్టుకు అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టడంతో విడాకుల అనుమానాన్ని మరింత బలపరిచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యదార్థ ఘటనలకు ప్రతిరూపం తంగలాన్‌ : విక్రమ్‌