Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెమినీ గణేశన్ వల్లే సావిత్రి హీరోయిన్ అయినట్లు చూపించారు.. తమ్మారెడ్డి

''మహానటి'' సినిమా విడుదలైన 26 రోజుల్లో రూ.26కోట్ల రూపాయల షేర్‌ను వసూలు చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి సినీతార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రను పోష

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (15:26 IST)
''మహానటి'' సినిమా విడుదలైన 26 రోజుల్లో రూ.26కోట్ల రూపాయల షేర్‌ను వసూలు చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి సినీతార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 9వ తేదీన విడుదలై భారీ కలెక్షన్లు సంపాదించింది.
 
తాజాగా ఈ సినిమా విడుదలైన 26 రోజుల్లో 26 కోట్ల రూపాయల షేర్‌ను వసూలు చేసింది. హీరోయిన్ ప్రాధాన్యత కలిగినా ఈ సినిమా వసూళ్లు బాగా రాబట్టింది. సావిత్రి జీవితంలోని విషాద సంఘటనలు, ఆమె మృతికి దారితీసిన పరిస్థితులను గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపడం ద్వారా ఈ సినిమా క్రేజ్ బాగా పెరిగింది.
 
ఇదిలా ఉంటే.. మహానటి సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో జెమినీ గణేశన్‌గారిని ఎలివేట్ చేశారన్నారు. సావిత్రి గారి గురించి మాకు బాగా తెలుసు. మా స్టూడియోలో చాలా సినిమాలు చేశారు. మహానటి చూసిన తరువాత చాలా డిజప్పాయింట్ అయ్యానన్నారు. 
 
ఇందులో జెమినీ గణేశన్ వల్లే సావిత్రి హీరోయిన్ అయినట్లు, అయన్ని చాలా మంచి వాడిగా చూపించారు. అలా చూపించకుండా ఉండి ఉంటే బాగుండేదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే నాగ్ అశ్విన్ ఆలోచనలో అలాలేదు కాబట్టి ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది అది వేరే విషయమంటూ కామెంట్స్ చేశారు. మహానటి సావిత్రి బయోపిక్ కాదని కల్పిత కథని, చెప్పారు. 
 
ఈ చిత్రంలో మహానటి మంచిదే.. జెమినీ గణేశన్ మంచోడు.. వాళ్ల పిల్లలూ మంచోళ్లే.. ఈ చిత్రాన్ని చూసి మీరు తిట్టుకోవద్దు. ఈ సినిమా చూసి ఓ మంచి అనుభూతి పొందా అని చూసి రండి, అంతే తప్ప గొడవలు పడొద్దు అంటూ జెమినీ గణేశన్ కూతుళ్లను, సావిత్రి కూతుళ్లనకు హితవు పలికారు తమ్మారెడ్డి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments