Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయ్ కిరణ్‌‌ని దత్తత తీసుకుని వుంటే.. అది జరిగేది కాదు?: నటి సుధ

ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ.. సుదీర్ఘ సినీ కెరీర్‌కు సంబంధించిన అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. భావోద్వేగానికి గుర

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (14:52 IST)
ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ.. సుదీర్ఘ సినీ కెరీర్‌కు సంబంధించిన అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురైయ్యారు.


ఉదయ్ కిరణ్‌ను ఓ దశలో దత్తత తీసుకోవాలనుకున్నట్లు సుధ చెప్పారు. ఉదయ్ కిరణ్‌ తనతో తొమ్మిది సినిమాల్లో కొడుకుగా నటించాడని.. బాలచందర్ గారి గురించి, ఉదయ్ కిరణ్‌ గురించి అడిగితే భావోద్వేగానికి లోనవుతానని సుధ వెల్లడించారు. 
 
ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా.. వారిద్దరి గురించి మాట్లాడినప్పుడు ఎమోషనల్ కాకతప్పట్లేదని సుధ తెలిపారు. ఉదయ్ కిరణ్‌తో తనకు తల్లీకుమారుల ఫీలింగ్ బాగా పెరిగిపోయింది. వాడి ప్రవర్తన కూడా అలాగే వుండేది. అమ్మా అమ్మా అంటూ ఆప్యాయంగా పిలిచేవాడు. కానీ ఉదయ్ అలాంటి ఆలోచనకు వెళ్తాడనుకోలేదు.

ఒకవేళ తాను దత్తత తీసుకుని వుండి వుంటే ఇలా జరిగివుండేది కాదేమోనని సుధ అన్నారు. ఉదయ్ కిరణ్ అతడి మదర్ చనిపోయాక తనను కలిశాడు. షూటింగ్‌లో ఉంటే తనవద్దకు వచ్చి.. ఏడుస్తూ వుండిపోయాడు. 
 
అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాను. మిమ్మల్ని అమ్మ అని పిలవాలనుందని.. మీతో అన్నీ చెప్పాలనిపిస్తుందన్నాడు. కానీ ఏడుస్తూ వుండిపోయాడే గానీ ఏమీ చెప్పలేదని సుధ గుర్తు చేసుకున్నారు.

ఉదయ్ కిరణ్‌ కూడా పోలికల్లో తన కుమారుడిలా వుంటాడని.. వాడిని ఎలా చూసుకున్నానో ఉదయ్ కిరణ్‌ను అలాగే చూసుకున్నాను. వారిద్దరికీ ఒకటే తేడా. బంటీ తన కడుపున పుట్టాడు. ఉదయ్ కిరణ్ పుట్టలేదు... అని సుధ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Minor girl: 15 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

వామ్మో... దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చింది..

కొడాలి నాని జంప్ జిలానీనా? లుకౌట్ నోటీసు జారీ!!

Visakhapatnam Covid Case: విశాఖపట్నంలో కొత్త కరోనా వైరస్ కేసు- మహిళకు కరోనా పాజిటివ్

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments