Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ హీరో సీక్రెట్‌గా వచ్చారు.. సైలెంట్‌గా పనిముగించి వెళ్లారు... ఎవరతను?

తమిళ చిత్రపరిశ్రమలో ఆయనో స్టార్ హీరో. లక్షలాది మంది అభిమానులు మాత్రం ముద్దుగా దళపతి అని పిలుచుకుంటారు. ఆయన పేరు విజయ్. ఏ పని చేసినా చడీచప్పుడు కాకుండా పూర్తిచేస్తారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా మిన్నకు

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (14:32 IST)
తమిళ చిత్రపరిశ్రమలో ఆయనో స్టార్ హీరో. లక్షలాది మంది అభిమానులు మాత్రం ముద్దుగా దళపతి అని పిలుచుకుంటారు. ఆయన పేరు విజయ్. ఏ పని చేసినా చడీచప్పుడు కాకుండా పూర్తిచేస్తారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా మిన్నకుండిపోవడం ఆయన నైజం. అలాంటి పనే మరొకదాన్ని పూర్తిచేశారు.
 
తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ ఆందోళన జరిగింది. ఈ ఆందోళన ఉధృతం కావడంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది వరకు చనిపోయారు. ఈ మృతుల కుటుంబ సభ్యులను పలువురు హీరోలు, రాజకీయ నేతలు వచ్చి పరామర్శించారు. వీరంతా పెద్ద హడావుడి చేస్తూ వచ్చి వెళ్లారు. పబ్లిసిటీ కోసం వెంపర్లాడారు. 
 
కానీ, హీరో విజయ్ ఇందుకు పూర్తి విరుద్ధం. తూత్తుకుడికి వచ్చిన విజయ్.. ఎలాంటి హ‌డావిడీ లేకుండా సైలెంట్‌గా వ‌చ్చి అంతే సైలెంట్‌గా వెళ్లిపోయారు. మంగ‌ళ‌వారం రాత్రి బైక్‌పై విజ‌య్ తూత్తుకుడి చేరుకున్నారు. బాధిత కుటుంబాల‌తో మాట్లాడి వారికి రూ.ల‌క్ష చొప్పున ఆర్థిక స‌హాయం ప్ర‌క‌టించారు. 
 
మ‌ళ్లీ ఎలాంటి హ‌డావిడీ లేకుండా బైక్‌పై చెన్నై వెళ్లిపోయారు. తూత్తుకుడిలో విజ‌య్ బైక్‌పై తిరుగుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ వీడియోలను చూసిన ప్రతి ఒక్కరూ విజ‌య్ రియ‌ల్ హీరో అంటూ నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments