Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉపరాష్ట్రపతిగా కాదు.. ఉషాపతిగానే వచ్చా.. పిచ్చిరాతలు వద్దు (వీడియో)

భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్య నాయుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తొలిసారి వచ్చారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం శ్రీవారిని

ఉపరాష్ట్రపతిగా కాదు.. ఉషాపతిగానే వచ్చా.. పిచ్చిరాతలు వద్దు (వీడియో)
, గురువారం, 11 జనవరి 2018 (16:01 IST)
భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్య నాయుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తొలిసారి వచ్చారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
బుధవారం రాత్రే తిరుమలకు చేరుకున్న ఆయన ముందుగా ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణకి చేరుకుని పవిత్ర జలాలను ప్రోక్షణం చేసుకున్నారు. అనంతంర శ్రీవరాహస్వామివారి దర్శించుకుని వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. సామాన్య భక్తులతోపాటు క్యూలైన్‌లో స్వామివారి ఆలయానికి వచ్చిన వెంకయ్య, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అధికారుల ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. 
 
శ్రీవారి దర్శనం అనంతరం అద్దాల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తర్వాత టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఏఈఓ శ్రీనివాసరాజులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. వెంకయ్య నాయుడి వెంట ఏపీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న కూడా ఉన్నారు.
 
దర్శనానంతరం వెంకయ్య మాట్లాడుతూ, దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మరింత పట్టుదలతో కర్తవ్య నిర్వహణ చేయాలని భగవంతుడిని ప్రార్థించినట్టు చెప్పారు. మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో నవ్యక్రాంతిని తీసుకురావాలి... మరింత శక్తిమంతమైన దేశంగా భారత్ ఎదగాలని ఆకాక్షించినట్టు చెప్పారు. 
 
కాగా, భారత ఉపరాష్ట్రపతికి ఆలయ మహద్వార ప్రవేశం ఉన్నప్పటికీ సామాన్య భక్తులి మాదిరిగా లోనికి ప్రవేశించారు. దీనిపై కూడా వెంకయ్య నాయుడు వివరణ ఇచ్చారు. శ్రీవారి దర్శనానికి తాను ఒక్కడినే రాలేదనీ, కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చాననీ, అందువల్లే సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ విషయంపై రాద్దాంతం చేయొద్దనీ మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. వెంకయ్య శ్రీవారి దర్శన వీడియో చూడండి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌తో జాగ్రత్త.. మాల్వేర్ వచ్చేసింది... 232 యాప్స్‌‌తో డేంజర్