Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి నోరు లేనివారు... నేనైతేనా... పీఆర్పీపై పవన్ కళ్యాణ్ ఏమన్నారు?

గత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాలేక పోవడానికి గల కారణాలను ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తాజాగా వెల్లడించారు.

Advertiesment
చిరంజీవి నోరు లేనివారు... నేనైతేనా... పీఆర్పీపై పవన్ కళ్యాణ్ ఏమన్నారు?
, గురువారం, 7 డిశెంబరు 2017 (14:54 IST)
గత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాలేక పోవడానికి గల కారణాలను ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తాజాగా వెల్లడించారు. పార్టీ వ్యవస్థాపకుడు, తన అన్న చిరంజీవికి ప్రజాసేవ చేయాలన్న బలమైన ఆకాంక్ష, మంచి చేయాలనే తపన ఉందన్నారు. కానీ, ప్రజారాజ్యంలోని కొందరు స్వార్థపరులకు ఆ పార్టీ బలైపోయిందన్నారు. అలా జరగకుండా ఉండివుంటే పీఆర్పీ ఇపుడు అధికారంలో వుండేదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
రాజమండ్రిలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను స్ప‌ష్ట‌మైన‌ విధివిధానాలతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని స్పష్టంచేశారు. నిస్వార్థ‌మైన వారు ప్ర‌జారాజ్యం పార్టీలో ఉండుంటే ప్ర‌జారాజ్యం ఇప్పుడు అధికారంలో ఉండేదన్నారు. 
 
రాజ‌కీయం అంటే సీఎం కావ‌డం కాదని, సామాజిక మార్పు చేయ‌డ‌మే రాజ‌కీయమ‌న్నారు. 'సీఎం అవుతాను.. అప్ప‌టివ‌ర‌కు ఆగండి ప‌నులు చేస్తానంటే కుద‌ర‌ద'ని అన్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ప్ర‌భుత్వంతో ఎన్నో ప‌నులు చేయించ‌వ‌చ్చని హిత‌వు ప‌లికారు.
 
అలాగే, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ వంటి కమిట్‌మెంట్‌లేని వ్య‌క్తులు జ‌న‌సేన‌లో ఉండ‌కూడ‌దన్నారు. పీఆర్పీలో గుర్తింపు ఇవ్వ‌లేద‌ని చిరంజీవిపై వారు క‌స్సున లేచార‌ని, మ‌రి వారు ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతున్నా ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని పవన్ విమర్శలు ఎక్కుపెట్టారు. 
 
విభజన చట్టంలోని హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదాపై ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్, ఆయన భార్య, కేంద్ర రక్షణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఎందుకు మాట్లాడ‌రు? అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు. హోదాపై తానొక్క‌డినే మాట్లాడాలా? అని నిల‌దీశారు. సైద్ధాంతిక బ‌లంతో తాను జ‌న‌సేన పార్టీ పెట్టాన‌ని, గ‌తంలో బాగా ఆలోచించే బీజేపీ, టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చానని పవన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాది, పవన్‌‍ది ఒకటే ఆలోచనే.. పోలవరం విషయంలో రాజీపడను: చంద్రబాబు