పాపులారిటీ కోసం ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్తుంటారు. రాజకీయ నాయకులైనా సరే.. లేదంటే సినిమా తారలైనా సరే. అలాగని అంతా ఒకలా వుండరులెండి. ఎవరి దారి వారిదే. కాకపోతే కొందరు మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా వుండాలని ఏవేవో చేసేస్తుంటారు. అవి కాస్తా తీవ్ర విమర్శలకు దారి తీస్తుంటాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. తమిళ బిగ్ బాస్ బ్యూటీ, నటి మీరా మిధున్ పేరు చెబితే తమిళ యువతు ఉర్రూతలూగుతుంది. దీనికి కారణం ఆమె చేసే పనులే. సోషల్ మీడియాలో యువతకు పిచ్చెక్కించే పోస్టులు పెడుతుంటుంది. ఆమె గురించి విపరీతంగా మాట్లాడుకునేట్లు చేస్తుంది. మరోసారి ఇదే చేసింది.