Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీకంత సీనుందా? కంగనా రనౌత్‌పై మీరా మిథున్ మండిపాటు! (Video)

Advertiesment
నీకంత సీనుందా? కంగనా రనౌత్‌పై మీరా మిథున్ మండిపాటు! (Video)
, బుధవారం, 1 జులై 2020 (15:04 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత చరిత్రను ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. ఈ చిత్రం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ ఇటీవల రిలీజ్ చేయగా, సూపర్బ్‌గా వచ్చిందంటూ ప్రశంసలు వచ్చాయి. అయితే, ఈ చిత్రంలో న‌టించే అర్హ‌త కంగ‌నా ర‌నౌత్‌కి లేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది త‌మిళ న‌టి మీరా మిథున్. త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా కంగ‌నాపై నిప్పులు చెరిగింది.
 
సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత కంగ‌నా.. నెపోటిజంపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కొంద‌రు బాలీవుడ్ పెద్ద‌ల వ‌ల‌న‌నే సుశాంత్ డిప్రెష‌న్‌కి గురై సూసైడ్ చేసుకున్నాడ‌ని పేర్కొంది. అయితే ఈ నెపోజిటం అనే ప‌దం కొద్ది రోజులుగా ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా, ఈ పదాన్ని తమిళ సినిమాకు ఆపాదించే వ్యక్తులు కూడా ఉన్నారు. 
 
త‌మిళ న‌టి మీరా మిథున్ తన ట్విట్టర్‌లో తాను నెపోటిజం బాధితురాలినేన‌ని కంగ‌నాపై విరుచుకుప‌డింది. జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో న‌టించ‌డానికి కంగ‌నాకి ఏం అర్హ‌త ఉంది. ఏం చూసి ఆమెని ఎంపిక చేసుకున్నారు. కోలీవుడ్‌లో న‌డుస్తున్న రాజ‌కీయాలే దీనికి ప్ర‌ధాన కార‌ణం అని మీరా పేర్కొంది. 
 
'నా రాష్ట్ర సీఎం పాత్ర‌లో పోషించ‌డానికి నువ్వు అన‌ర్హురాలివి. షేమ్ ఫ‌ర్ మై లేట్ బిల‌వుడ్ సీఎం' అంటూ కంగ‌నాపై నిప్పులు చెరిగింది మీరా మిథున్‌. దీనిపై కంగానా ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమిర్ ఖాన్ అమ్మకు కరోనా నెగెటివ్