Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ వీడియో చూపించి అవకాశాలు రాకుండా చేస్తున్నారు.. (video)

Advertiesment
ఆ వీడియో చూపించి అవకాశాలు రాకుండా చేస్తున్నారు.. (video)
, గురువారం, 10 సెప్టెంబరు 2020 (13:46 IST)
విశ్వనటుడు కమల్ హాసన్‌కు తమిళ నటి మీరా మిథున్ గట్టివార్నింగ్ ఇచ్చింది. ఈ యేడాది తమిళ బిగ్ బాస్ జరగనివ్వబోనని శపథం చేసింది. తనకు మూవీ అవకాశాలు రాకుండా కమల్ హాసన్ చేస్తున్నారనీ, అందుకే తాను బిగ్ బాస్ జరుగకుండా కోర్టుకెళ్లి స్టే తీసుకుని వస్తానని తెలిపింది. 
 
అసల ఉన్నట్టుండి కమల్ హాసన్, మీరా మిథున్‌ల మధ్య వివాదం ఎందుకు చెలరేగిందో ఓసారి పరిశీలిద్ధాం. మీరా మిథున్ తమిళ బిగ్ బాస్ సీజన్-3లో పాల్గొని ఎక్కడా లేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెల్సిందే. 
 
ఆ షోలో మరో కంటెస్టెంట్‌గా ఉన్న దర్శకుడు చేరన్, తన నడుమును గట్టిగా పట్టేసుకుని గిల్లాడని సంచలన ఆరోపణలు చేయగా, ఆ వారాంతంలో కమల్ హాసన్, మీరా మిథున్ అబద్ధాలు చెబుతున్నదంటూ అసలు వీడియోను కమల్ ప్రేక్షకులకు చూపించారు. దీంతో మీరా మిథున్ ఖంగుతింది. అప్పటి నుంచి కమల్‌పై తన ఆగ్రహాన్ని వీలు చిక్కినప్పుడల్లా ప్రదర్శిస్తూనే ఉంది.
 
ఈ క్రమంలో ఈ యేడాది కోలీవుడ్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్‌ను అడ్డుకుని తీరుతానని, కోర్టుకు వెళ్లి, స్టే తీసుకుని అయినా వస్తానని ఆమె చేసిన హెచ్చరిక ఇపుడు కోలీవుడ్‌లో కలకలం రేపింది. ఈ సీజన్ బిగ్ బాస్ షోను కమల్ ఎంత అనుకున్నా సక్రమంగా జరపలేరని సవాల్ విసిరింది. తనకు సంబంధించిన ఓ వీడియోను కమల్ తన వద్ద దాచి పెట్టుకున్నారని, దాన్ని చూపిస్తూ, తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఆరోపించింది.
 
ఇక తాజాగా, మీరా మిథున్ రెచ్చగొట్టేలా మాట్లాడినా, అటు కమల్ గానీ, ఇటు బిగ్ బాస్ నాలుగో సీజన్‌ను ప్రసారం చేయబోతున్న విజయ్ టీవీ నిర్వాహకులుగానీ పెద్దగా పట్టించుకోలేదు. పైగా, తాము అనుకున్న సమయానికే ఈ బిగ్ బాస్ రియాల్టీ షోను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. మరి చివరకు ఇది ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16 యేళ్ళ ప్రాయంలో కెమెరా ముందుకొచ్చా.. విధి మరో దారిలోకి తీసుకెళ్లింది...