Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాస్టింగ్ కౌచ్ గురించి తాప్సీ ఇలా అనేసింది..

హాలీవుడ్ నుంచి బాలీవుడ్ అక్కడ నుంచి టాలీవుడ్‌కు క్యాస్టింగ్ కౌచ్ పాకింది. శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ వివాదం మరింత రాజుకుంది. దీంతో మీడియా ముందుకొస్తున్న ప్రతి హీరోయ

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (12:26 IST)
హాలీవుడ్ నుంచి బాలీవుడ్ అక్కడ నుంచి టాలీవుడ్‌కు క్యాస్టింగ్ కౌచ్ పాకింది. శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ వివాదం మరింత రాజుకుంది. దీంతో మీడియా ముందుకొస్తున్న ప్రతి హీరోయిన్‌కి క్యాస్టింగ్ కౌచ్‌‍కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 
 
తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై తాప్సీ స్పందించింది. తాజాగా తాప్సి నటించిన నీవెవరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టాక్ ఎలా ఉన్నా.. తాప్సి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో పలు సినిమాలతో బిజీగా గడుపుతోంది. 
 
అదృష్టమో, దురదృష్టమో కానీ తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు లేవు. తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురై ఉంటే అప్పుడు ఈ విషయంపై చాలా బాగా మాట్లాడేదాన్ని అంటూ తాప్సీ తెలిపింది. 'పింక్' సినిమా విడుదలైన తరువాత తాను మహిళా సమస్యలపై మాట్లాడతానని చాలామంది ఎదురుచూస్తున్నారు. కాబట్టి క్యాస్టింగ్ కౌ‌చ్‌పై మాట్లాడితే బాగుండేది. కానీ తనకు అది అనుభవం లేని విషయమని చెప్పింది. 
 
తొలుత నుంచి కూడా తాను పెద్ద బేనర్లు, పెద్ద దర్శకులతో పనిచేశాను. అలాగే కెరీర్ కొనసాగింది. ఫలితంగా తనతో అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ఎవ్వరూ సాహసించలేకపోయారు. ఇది తనకు బాగా కలిసొచ్చింది. భవిష్యత్తులో కూడా ఈ విషయంపై మాట్లాడే అవకాశం తనకు రాదేమోనని తాప్సీ బదులిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments