Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరళ వరదలు.. ''అవి'' కూడా అవసరమేనన్నాడు.. ఉద్యోగం వూడిపోయింది..

కేరళ వరద బాధితులకు దేశం నలుమూలల నుంచి సాయం అందుతోంది. కనీస వసతులు లేకుండా.. తిండి, నీరు, నిద్రలేకుండా జనాలు కష్టాలు పడుతున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఇతర రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు ముందుకు వస్తున్న

Advertiesment
కేరళ వరదలు.. ''అవి'' కూడా అవసరమేనన్నాడు.. ఉద్యోగం వూడిపోయింది..
, సోమవారం, 20 ఆగస్టు 2018 (14:06 IST)
కేరళ వరద బాధితులకు దేశం నలుమూలల నుంచి సాయం అందుతోంది. కనీస వసతులు లేకుండా.. తిండి, నీరు, నిద్రలేకుండా జనాలు కష్టాలు పడుతున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఇతర రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు ముందుకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో కేరళ ప్రజలపై వ్యంగ్యంగా ఓ చెత్త ట్వీట్ చేసి ఓ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన రాహుల్‌ చెరు పళయట్టు ఒమన్‌లోని లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. కేరళలో వరదల నేపథ్యంలో బాధితులకు అండగా సోషల్‌ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్న సందర్భంగా శానిటరీ నాప్‌కీన్లు కూడా అందిస్తే బాగుంటుందని ఓ నెటిజన్ పోస్టు చేశారు. ఈ పోస్టుకు స్పందించిన రాహుల్‌.. ''కండోమ్‌లు కూడా అవసరమే'' అంటూ అభ్యంతరకరమైన పోస్టు పెట్టాడు. రాహుల్ పోస్టుపై లులు గ్రూమ్ కంపెనీ ఫైర్ అయ్యింది. అంతేగాకుండా అతడిని వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 
 
రాహుల్‌ సోషల్‌ మీడియాలో చేసిన అసభ్య కామెంట్ల నేపథ్యంలో అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం మత్తులో అలా పోస్టు చేశానని రాహుల్ క్షమాపణలు చెప్పినా కంపెనీ పట్టించుకోలేదు. తమ సంస్థ మానవ సంబంధాలకు, నైతిక విలువలకు కట్టుబడి ఉంటుందని.. రాహుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం సబబేనని కంపెనీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిలో రెడ్ అలెర్ట్.. కొండవీటి వాగుతో ముప్పు..