Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సినిమా కాపీ కొట్టి గీత గోవిందం తీశాడు... రాఘవేంద్ర రావు

16వ సంతోషం అవార్డుల ఫంక్షనులో ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ, `20 ఏళ్ల క్రితం నేను-అర‌వింద్‌గారు క‌ల‌సి పెళ్లి సంద‌డి సినిమా తీశాం. మ‌ళ్లీ గీత‌ గోవిందం ఆ సినిమాను గుర్తుచేసింది. బుజ్జీ నా సినిమాను కాపీ కొట్టాడు(న‌వ్వుతూ). ఒక ముద్దు కూడా ల

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (22:12 IST)
16వ సంతోషం అవార్డుల ఫంక్షనులో ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ, `20 ఏళ్ల క్రితం నేను-అర‌వింద్‌గారు క‌ల‌సి పెళ్లి సంద‌డి సినిమా తీశాం. మ‌ళ్లీ గీత‌ గోవిందం ఆ సినిమాను గుర్తుచేసింది. బుజ్జీ నా సినిమాను కాపీ కొట్టాడు(న‌వ్వుతూ). ఒక ముద్దు కూడా లేకుండా సినిమా చేయ‌డం అంటే చాలా క‌ష్టం. నిర్మాత‌ల ద‌గ్గ‌ర నుంచి చాలా ఒత్తిళ్లు ఉంటాయి. అవి బుజ్జీ కూడా ఫేస్ చేసి ఉంటాడు. రాజీ ప‌డ‌కుండా మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది` అని అన్నారు.
 
 నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ, `నాన్న‌గారు రామానాయుడు పేరు సురేష్ సంతోషం అవార్డు ఇవ్వ‌డం చాలా ఆనందంగా ఉంది. వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు ఈ ఏడాది ఆ అవార్డు అందుకుంటున్నందుకు మ‌రింత సంతోషంగా ఉంది` అని అన్నారు.
 
 
 
కె.ఎల్ నారాయ‌ణ మాట్లాడుతూ, `గీత‌ గోవిందం మంచి ఎంట‌ర్ టైన‌ర్. త‌క్కుబ బ‌డ్జెట్లో తెరకెక్కిన సినిమా మంచి వ‌సూళ్ల‌ను సాధిచండం... ఈ వేదిక‌పై బుజ్జీని స‌న్మానించ‌డం సంతోషంగా ఉంది` అని అన్నారు.
 
 జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మాట్లాడుతూ, ` నా అలెగ్జెండ‌ర్‌కు సంతోషం అవార్డు రావడం చాలా సంతోషం. ఈ సినిమాలో కేవ‌లం నేనొక్క‌డినే న‌టించా. రెండు గంట‌ల పాటు నేనే క‌నిపిస్తా. అందుకే సినిమా రిలీజ్ చేయ‌ను. ఎవ‌రైనా చూడాల‌నుకుంటే షో వేసి చూపిస్తా. ఏ అవార్డులు రావు అనుకున్నా. కానీ సురేష్ గారు అవార్డు ఇచ్చారు. ఈ సినిమాకు పూస‌ల వీర వెంక‌టేశ్వ‌ర‌రావు మంచి ర‌చ‌న చేసారు. అందుకే ఈ అవార్డు ఆయ‌న‌కు అంకిత‌మిస్తున్నా` అని అన్నారు.
 
 
 
రాజేంద్ర ప‌సాద్ మాట్లాడుతూ, ` సురేష్ నాకు త‌మ్ముడు లాంటోడు. ఆయ‌న ఈ ఏడాది న‌న్ను అవార్డుకు ఎంపిక చేసినంద‌కు చాలా కృత‌జ్ఞ‌త‌లు. ఈ గౌర‌వమ్యాద‌ల‌న్నీ నాకు సినిమాలు వ‌ల్లే ద‌క్కాయి. ఎంతోమంది ద‌ర్శ‌కనిర్మాత‌లు ప్రోత్స‌హించ‌డం వ‌ల్లే ఈ స్థాయిలో ఉన్నాను. అంత‌కుమించి ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆద‌రించారు. నేటిత‌రం ద‌ర్శ‌కులు కూడా న‌న్ను ఎంక‌రేజ్ చేస్తూ నాకోసం అంటూ కొన్ని పాత్ర‌లు రాస్తున్నారు. అందుకే న‌టుడిగా బిజీగా ఉండ‌గ‌ల్గుతున్నాను` అని అన్నారు.
 
 
 
బ్ర‌హ్మాజీ మాట్లాడుతూ, `మా అన్న‌య్య అర‌వింద్ గారికి న‌న్ను ప‌రిచ‌యం చేసారు. అదే బ్యాన‌ల్లో సినిమాలు చేసి ఇంత‌టివాడిన‌య్యా. అల్లు రామ‌లింగయ్య అవార్డు అందుకోవ‌డానికి ఏ అర్హ‌త లేదు. కానీ న‌న్ను గుర్తించి ఇచ్చింనందుకు సురేష్ గారికి, అర‌వింద్ గారికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నా. అలాగే 24 శాఖ‌లు వారు నన్ను ఎంత‌గానో ప్రోత్స‌హించారు. ఇంకా చాలామంది, ద‌ర్శ‌కనిర్మాత‌ల వ‌ల్ల ఈ స్థాయిలో ఉన్నాను` అని అన్నారు.
 
ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా మాట్లాడుతూ, `నా జీవితంలో ఈ ఆగ‌స్టు గుర్తుండిపోతుంది. సాధార‌ణంగా అవార్డు వ‌స్తే సంతోషంగా ఉంటుంది. మ‌రి సంతోష‌మే సంతోషాన్నిస్తుంటే ఇంకెలా ఉంటుంది? అదీ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకుంటే ఇంకెంత‌ ఆనందంగా ఉంటుందో మాట‌ల్లో చెప్ప‌లేను. ఈ అవార్డు వ‌చ్చిందంటే కార‌ణం బాల‌కృష్ణ గారు, క్రిష్ ఇంకా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి టీమ్ అంతా. వాళ్లు లేక‌పోతే ఈ అవార్డు లేదు. వ‌చ్చే ఏడాది `సైరా న‌ర‌సింహారెడ్డి`కి గాను ఇదే అవార్డు నాకు రావాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments