చిరును చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే... గాన కోకిల జానకి 'ముద్దు'గా...
16వ సంతోషం అవార్డు ఫంక్షనులో గానకోకిల ఎస్. జానకి మాట్లాడుతూ, ` సురేష్ 5 ఏళ్ల నుంచి ఫంక్షన్‌కు రావాలని అడుగుతున్నాడు. కానీ నాకు కుదరక రాలేకపోతున్నాను. కానీ ఈసారి కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకుని వచ్చా. ఇక్కడ చిరంజీవి గారిని చూస్తుంటే చాల
16వ సంతోషం అవార్డు ఫంక్షనులో గానకోకిల ఎస్. జానకి మాట్లాడుతూ, ` సురేష్ 5 ఏళ్ల నుంచి ఫంక్షన్‌కు రావాలని అడుగుతున్నాడు. కానీ నాకు కుదరక రాలేకపోతున్నాను. కానీ ఈసారి కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకుని వచ్చా. ఇక్కడ చిరంజీవి గారిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మెగాస్టార్‌కు చాలా సినిమాల్లో పాటలు పాడాను. అప్పటి హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు నావే. చిరు కళ్లలో ఏదో మాయ ఉంది. ఒంట్లో ఎనర్జీ ఉంది.
నటన, డాన్సు, ఫైట్లు ఇలా పత్రీ విషయంలో ఆయన ప్రత్యేకమే. ఆయన్ని చూస్తే.. ఆయన వెంట ఎవరైనా పడాల్సిందే( సినిమాల్లో నవ్వుతూ). 125 ఏళ్లు సంతోషంగా జీవించాలి. ఖైదీ నంబర్ 150వ సినిమా చూసాను. పాత చిరంజీవిని చూసినట్లే ఉంది. ఇక ఇప్పుడు నటిస్తోన్న సైరా నరసింహారెడ్డి కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, `16 ఏళ్లగా సురేష్ ఒక్కడే అన్నీ తానై ఈ వేడుకలను నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఇలాంటి ఫంక్షన్లు చేయాలంటే చాలామంది అవసరం ఉంటుంది. కానీ సురేష్ వన్ మేన్ ఆర్మీలా చేస్తాడు. అతని ఓపిక.. సహనానికి మెచ్చుకోవాల్సిందే. సౌత్‌లో ఉన్న అన్నీ భాషల నటీనటులను ఏకం చేసి వేడుక చేయడం చాలా గొప్పగా ఉంది.
ఇలాంటి అవార్డులు ప్రదానం చేయడం ద్వారా నూతన నటీనటుల్లో, సాంకేతిక నిపుణుల్లో ఉత్సాహం నింపినట్లు అవుతుంది. కొత్తవారు రావడానికి అవకాశం ఉంటుంది. సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడంలో ఎందరో పెద్దల కృషి ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు గారు లాంటి వారివల్ల సాధ్యమైంది. నాటి నుంచి పరిశ్రమ దినదిన అభివృద్ది చెందుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా ఎప్పుడూ ఉంటుంది` అని అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ, `నాన్నగారి (అల్లు రామలింగయ్యస్మారక అవార్డు) పేరు మీద సంతోషం అవార్డును 10 ఏళ్లుగా ఆయన గుర్తుగా సురేష్ కొండేటి ఇస్తుంన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ ఏడాది బ్రహాజీ అందుకోవడం మరింత అనందాన్నిస్తుంది. ఈ అవార్డు బ్రహ్మాజీకే ఎందుకివ్వాలని సురేష్‌ను ప్రశ్నించా. అందుకు సురేష్ ఏమన్నాడంటే? రామలింగయ్య గారు కమెడీయన్ మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టు కూడా. అలాగే బ్రహ్మజీ కామెడీతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్‌గాను నటిస్తున్నాడు. అందుకే ఇవ్వాలనుకున్నాం అన్నాడు. నిజమే కదా అనిపించింది. బ్రహ్మాజీ ఎలాంటి పాత్రకైనా మౌల్డ్ అవుతాడు. పాత్రలో వేరియేషన్స్ చూపిస్తాడు. అదే అతనిలో గొప్పతనం. ఇదే వేదికపై గీతగోవిందంతో పెద్ద విజయాన్ని అందించిన పరుశురాం బుజ్జిని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు.