Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉన్నవి చూపించుకోవడంలో తప్పేంటి?: రష్మీ గౌతమ్

క్యాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న నేపథ్యంలో.. యాంకర్, నటి రష్మి గౌతమ్ కూడా దీనిపై స్పందించింది. అయితే క్యాస్టింగ్ కౌచ్‌పై రష్మీ గౌతమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. క్యాస్టింగ్ కౌచ్‌ప

Advertiesment
ఉన్నవి చూపించుకోవడంలో తప్పేంటి?: రష్మీ గౌతమ్
, సోమవారం, 27 ఆగస్టు 2018 (14:12 IST)
క్యాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న నేపథ్యంలో.. యాంకర్, నటి రష్మి గౌతమ్ కూడా దీనిపై స్పందించింది. అయితే క్యాస్టింగ్ కౌచ్‌పై రష్మీ గౌతమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. క్యాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే చాలామంది హీరోయిన్లు స్పందించారు. కొందరు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటే.. మరికొందరు మాత్రం తమకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని అన్నారు. 
 
ఇంకొందరైతే.. క్యాస్టింగ్ కౌచ్‌పై ఎదురు తిరగాలని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ రష్మీ క్యాస్టింగ్ కౌచ్‌పై ఏం చెప్పిందంటే..? అసలు కాస్టింగ్ కౌచ్‌లో తప్పేముంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను సినిమాల్లో నటిస్తున్నాను.. ఏ నిర్మాత కూడా తనతో తప్పుగా ప్రవర్తించలేదు. ఈ విషయంలో తాను నిజాయితీగా సమాధానం చెప్పాలనుకుంటున్నానని రష్మీ గౌతమ్ వ్యాఖ్యానించింది. 
 
తన దృష్టిలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక ఛాయిస్.. దాన్ని తాను గౌరవిస్తాను కూడా. క్యాస్టింగ్ కౌచ్‌కి ఓకే చెప్పడంలో తప్పులేదు. అది ఇద్దరి అంగీకారంతో జరుగుతుంది. ఇది ఎవరికి వారి వ్యక్తిగత విషయం. తనతో అంతకుమించి నిర్మాత మిస్ బిహేవ్ చేయలేదు. అయినా ప్రతి విషయంలో నో చెప్పే ఆప్షన్ ఒకటి వుంటుంది కదా అంటూ రష్మీ వ్యాఖ్యానించింది. 
 
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద విషయాలు జరిగాయి. అవన్నీ తనకు బాగా తెలుసు. శ్రీరెడ్డి పరిస్థితి కావొచ్చు.. మరొకటి కావొచ్చు.. ఏదేమైనా.. ఎవరూ మనల్ని మానభంగం చేయలేరు, బలవంతం చేయలేరు. ప్రతీ విషయంలో నో చెప్పే ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు. ప్రతీ చోట క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఈ వ్యవహారాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని, ఉన్నవి చూపించుకోవడంలో తప్పేంటి అంటూ రష్మీ గౌతమ్ ఎదురు ప్రశ్న వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికి షరతులు వర్తిస్తాయ్ : నటి పూర్ణ