Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా సపోర్ట్ కౌషల్‌కే.. కౌషల్ గెలుపు ఏకపక్షం.. గెలవకుంటే ధర్నాలే.. రష్మీ కామెంట్స్

జబర్దస్త్ యాంకర్‍గా పాపులర్ అయిన రష్మీ తన సినిమాలలో అందాల ఆరబోతతో యువతకు హాట్ ఫేవరేట్‌గా మారిపోయింది. ఈ అమ్మడికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే గుంటూరు టాకీస్‌లో హాట్ హాట్‌గా కనిపించి కుర్రకారు

నా సపోర్ట్ కౌషల్‌కే.. కౌషల్ గెలుపు ఏకపక్షం.. గెలవకుంటే ధర్నాలే.. రష్మీ కామెంట్స్
, శుక్రవారం, 24 ఆగస్టు 2018 (12:24 IST)
జబర్దస్త్ యాంకర్‍గా పాపులర్ అయిన రష్మీ తన సినిమాలలో అందాల ఆరబోతతో యువతకు హాట్ ఫేవరేట్‌గా మారిపోయింది. ఈ అమ్మడికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే "గుంటూరు టాకీస్‌" చిత్రంలో హాట్ హాట్‌గా కనిపించి కుర్రకారు మనస్సు దోచుకున్న ఈ భామ తాజాగా "అంతకుమించి" అనే చిత్రంతో ముందుకు రానుంది.


టీజర్, ట్రైలర్స్‌లో రష్మీ అందాల ఘాటు గురించి ఇప్పటికే యువత చర్చించుకుంటుండగా ఆగస్టు 24న విడుదలవుతున్న చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.
 
తాను బిగ్ బాస్ షో రెగ్యులర్‌గా చూడనని, అయితే షోలో పాల్గొంటున్న సభ్యులలో చాలా మంది తనకు తెలిసిన వాళ్ళు కావడంతో సోషల్ మీడియాలో వస్తున్న అప్‌డేట్‌లను ఫాలో అవుతుంటానని చెప్పింది. నందిని రాయ్, కౌశల్ తనకు మంచి స్నేహితులని, గీత మధురితో కాస్త పరిచయం ఉందని చెప్పింది.
 
అంతేకాకుండా కౌశల్ ఆర్మీ పేరుతో ఆడియన్స్‌లో కౌషల్‌కు లభించిన జనాదరణ చూస్తే కౌశల్ గెలుపు ఏకపక్షం అని అర్థం అయిపోతోంది, కౌశల్ ఒకవేళ విజేతగా నిలవకపోతే బయట ధర్నాలు జరిగినా ఆశ్చర్యం లేదని చమత్కరించింది.
 
ఈ వారం కౌషల్ నామినేషన్‌లో ఉన్నాడు. గత శనివారం నాని కౌశల్‌కు క్లాస్ పీకడం, కేవలం నలుగురే నామినేషన్‌లో ఉండటంతో కౌషల్ ఫ్యాన్స్ కూడా మరింత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతులు వెనక్కి విరిచి కట్టేశాం.. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది.. ఏంటిరా? ఆ ధైర్యం.. 'సైరా' డైలాగ్