Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా క్లైమాక్స్ పై ఉత్కంఠ‌. ఇంత‌కీ క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతుంది..?

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (12:39 IST)
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన ఈ సంచ‌ల‌న చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ మూవీని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. 
 
అభిమానుల ఎదురు చూపుల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే... ఈ సినిమాలో క్లైమాక్స్  సీన్ ని ఎలా చూపిస్తారు అనేది అందరిలో ప్రధానంగా ఉత్కంఠను రేపుతోంది. ఎందుకంటే... సైరా సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు అందరూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారు. 
 
అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏమిటంటే.. నరసింహారెడ్డి రెడ్డిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసి..  మరణించిన అనంతరం తలను కోట గుమ్మానికి వ్రేలాడదీశారు. దేశంలో ఒక్కసారిగా భయాన్ని కలుగజేసిన ఆ విషయాన్నీ తెర పై ఎలా చూపిస్తారు అనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. 
 
ఎందుకంటే... చిరంజీవి త‌ల‌ను అలా కోట‌కు వేలాడితీసిన‌ట్టు చూపిస్తే... జ‌నం ఒప్పుకుంటారా..?  చిరుని అలా చూడ‌గ‌ల‌రా..? అనేది అంద‌రిలో ఉన్న సందేహం. మ‌రి... చిరు కోసం క్లైమాక్స్ మార్చారా..?  లేక ఎలా జ‌రిగిందో అలాగే తీసారా...? అనేది తెలియాలంటే... అక్టోబర్ 2 వ‌ర‌కు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments