Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'ఎల్లువొచ్చి గోదారమ్మ' ప్రోమో సాంగ్ (వీడియో)

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (11:41 IST)
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం వాల్మీకి. సెన్సేషనల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ అచంట, గోపీ అచంటలు సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
అయితే, ఈ చిత్రంలో అలనాటి ఆల్‌టైమ్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమిక్స్ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, శోభన్ బాబు - శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన దేవత చిత్రంలోనిది. ఈ పాటను వాల్మీకి చిత్రంలో రీమిక్స్ చేశారు. 
 
శోభన్ బాబు, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాట ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఒరిజినల్ పాటకు ఏ మాత్రం తగ్గకుండా రీమిక్స్ చేసేందుకు ప్రయత్నించాడు దర్శకుడు హరీశ్ శంకర్. ఈ పాట ప్రోమోను కె.రాఘవేంద్ర రావు విడుదల చేశారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. 
 
త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం 'జిగ‌ర్తాండ‌కి' రీమేక్‌గా వాల్మీకి తెరకెక్కుతోంది. ఇపుడు ఈ పాట ప్రోమో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ నెల 17వ తేదీన విడుదలైన పాట.. ఇప్పటికే ఒక మిలియన్ వ్యూస్‌ను రాబట్టింది. అలాగే, 36 వేల మంది లైక్ చేయగా, 1.2 వేల మంది నెటిజన్లు డిజ్‌లైక్ చేశారు.
 
మరోవైపు ఈ పాటకు సంబంధించి ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో దర్శకేంద్రుడు సమక్షంలో వీడియో ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ, ఈ పాటలో పూజా హెగ్డే నడుంపై పెట్టుకున్న బిందె కావాలంటూ చమత్కరించారు. ఈ మాటలు విన్న పూజా హెగ్డే.. వెంటనే లేచి.. తాను నడుముపై పెట్టుకున్న బిందెను ఇపుడు వెతకడం సాధ్యపడదనీ చెబుతూనే... ఆ బిందెల్లో ఓ బిందెను తీసుకుని దానిపై ముద్దు పెట్టి... దర్శకేంద్రుడికి బహుమతిగా ఇచ్చింది. 
 
ఆ తర్వాత దర్శకేంద్రుడు మాటలు కొనసాగిస్తూ, పూజా హెగ్డేని చూసినరోజే ఈ అమ్మాయి టాప్‌ హీరోయిన్‌ అవుతుంది అన్నాను. వరుణ్‌ తేజ్ నటన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు. 15 ఏళ్ల క్రితం రామ్ అచంట.. గోపీ అచంట అనే నిర్మాతలతో కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఈ విధంగా అవకాశం వచ్చినందుకు హ్యాపీ. 'దేవత' సినిమా 25 వారాలు ఆడినట్టు 'వాల్మీకి' సినిమా కూడా 25 వారాలు ఎక్కడో ఒక చోట ఆడుతూనే ఉండాలి అని చెప్పుకొచ్చారు. 
 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments