Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబా భాస్కర్ సీరియస్ అయ్యాడు.. కనిపెట్టేసిన శ్రీముఖి

బాబా భాస్కర్ సీరియస్ అయ్యాడు.. కనిపెట్టేసిన శ్రీముఖి
, శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (12:44 IST)
బిగ్‌బాస్ మూడో సీజన్‌లో భాగంగా కామెడీ చేస్తూ ఎప్పుడూ నవ్వించే బాబా భాస్కర్ సీరియస్‌గా మారాడు. ఎందుకంటే..? అతనికి కెప్టెన్సీ వచ్చేసింది.
 
కెప్టెన్‌గా బిగ్‌బాస్‌ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే కెప్టెన్‌ అయిన తర్వాత బాబా మాస్టర్‌ మాట్లాడుతూ.. తనకు కెప్టెన్ కావడం ఇష్టం లేదని.. కాకుంటే టాస్క్‌లో తన బెస్ట్ ఇవ్వాలని కష్టపడతాడని తెలిపాడు. కెప్టెన్‌ అయ్యి వారిని వీరిని అజమాయిషీ చేయాలని తనకు లేదు అంటూ బాబా మాస్టర్‌ అన్నాడు.
 
అసలు కెప్టెన్‌ అయిన వెంటనే బాబా మాస్టర్‌ మొహం సీరియస్‌గా మారింది. ఆ విషయాన్ని శ్రీముఖి కూడా కనిపెట్టింది. ఆమె బాబా మాస్టర్‌ను కూల్‌ చేసేందుకు ప్రయత్నించింది. బాబా మాస్టర్‌ పదే పదే కెప్టెన్సీ వద్దు అనడంతో వరుణ్‌ సందేశ్‌ ఎవరి పనులు వారికి అసైన్ చేయండని చెప్పాడు. తర్వాత ఇక మీ ఇష్టం అనేశాడు. మరి బాబా భాస్కర్ కెప్టెన్సీని సమర్థవంతంగా నిర్వహిస్తాడో లేదో వేచి చూడాలి. 
 
ఇకపోతే.. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. ఈ టాస్క్‌లో బాబా భాస్కర్‌కి ఇంటి సభ్యుల తోడవడంతో బాబా ఇంటి కెప్టెన్‌గా గెలిచారు. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో శ్రీముఖి నిజ స్వరూపం బయటపడింది. కెప్టెన్ పోటీదారుగా ఉన్న శ్రీముఖి బాబా భాస్కర్ గెలిచినపుడు కంగ్రాట్స్ చెప్పింది. 
 
< ఇక బాబా భాస్కర్‌ని సపోర్ట్ చేసిన శిల్పా చక్రవర్తితో ఈ క్రెడిట్ అంతా నీకే ఇస్తాను బాబా భాస్కర్‌కి ఇవ్వనంటూ ఆయన మొహం మీదే చెప్పింది. బాబా భాస్కర్‌తో స్నేహంగా మెలిగే శ్రీముఖి ఇలా మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. శ్రీముఖి డబల్ స్టాండర్డ్స్‌తో గేమ్ ఆడుతుందని టాక్ వస్తోంది.

ఇంకా హౌస్‌లో తెగ ఇంగ్లీష్ మాట్లాడేస్తుందని.. అది ఫ్యాన్స్‌కు విసుగు తెప్పిస్తుందని కూడా టాక్ వస్తోంది. ఇంకేముంది.. బాబా భాస్కర్ కెప్టెన్ అయ్యాక.. ఆయన హౌస్ మేట్స్‌కు ఇచ్చిన రూల్స్ గురించి ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోను ఓ లుక్కేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్‌బాస్ మూడో సీజన్.. వితికాతో వరుణ్ డిష్యూం డిష్యూం..