Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగార్జునలా కాదు నేను, నా మాటే శాసనం: 'బిగ్ బాస్' హోస్ట్ శివగామి(video)

Advertiesment
Bigg Boss Telugu 3
, శనివారం, 31 ఆగస్టు 2019 (22:03 IST)
స్టార్ మాలో బిగ్ బాస్ మూడో సీజన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య బిగ్‌బాస్ 3 షో ప్రారంభమైంది. ఈ సీజన్‌కు టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతి శని, ఆదివారాల్లో హోస్ట్ చేసి ఎలిమినేషన్ చేస్తూ వచ్చిన నాగార్జున ఈ వారం మాత్రం అందుబాటులో వుండరు. 
 
పుట్టినరోజు సందర్భంగా నాగార్జున స్పెయిన్‌కు వెళ్లడంతో ఆగస్టు చివరివారంలో నాగార్జున హోస్ట్‌గా బుల్లితెరపై కనిపించరని మాతెలిపింది. అయితే ఆయన స్థానంలో బిగ్‌బాస్ 3ని ఎవరు హోస్ట్ చేస్తారనే దానిపై పలు వార్తలు వినపడ్డాయి. అయితే స్టార్ మా యాజమాన్యం ఈ వార్తలకు చెక్ పెడుతూ బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా శివగామిని తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.
 
ఇక ఆరోవారం ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు హిమజ, పునర్నవి, మహేష్. బిగ్ బాస్ ప్రేక్షకుల అంచనాల మేరకు ఈ వారం ఎలిమినేషన్‌లో మహేష్ విట్టా లేదా హిమజ ఉంటారని భావిస్తున్నారు. ఇక ఈ వారం హోస్ట్‌గా వ్యవహరిస్తున్నబాహుబలి శివగామి ఎవరిని ఎలిమినేట్ చేస్తారో మరి.
 
బిగ్ బాస్ త్రీ లో నలభై రోజు బాబా మాస్టర్ వ్యాఖ్యలే హైలైట్ అయ్యాయి. తాను కెప్టెన్ అయితే హౌస్‌లో షార్ట్ డ్రెస్‌లను బ్యాన్ చేస్తాననే పునర్నవిని ఉద్దేశించి బాబా మాస్టర్ అన్నాడు. ఈ విషయాన్ని అలీ వచ్చి జ్యోతి, వితిక, హిమజతో అన్నాడు. పొద్దున్నే లేడీస్ అంతా లేచి ముగ్గులు వేసి అబ్బాయిలను నిద్రలేపాలని బాబా మాస్టర్ అంటున్నాడు అని చెప్పాడు. 
 
ఇదంతా చూడటం కోసమైనా బాబా మాస్టర్ కెప్టెన్సీని కోరుకుంటానని జ్యోతి అంది. పునర్నవి వచ్చి బాబా మాస్టర్‌తో మీరు కెప్టెన్ అయితే నేను వారం మొత్తం షాట్స్‌లోనే తిరుగుతానని చెప్పింది. తర్వాత పునర్నవి, శ్రీముఖితో కెప్టెన్సీ తర్వాత నా రియల్ ఫేస్ చూపిస్తానని చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇట‌లీలో చాణ‌క్య ఏం చేస్తున్నాడు..?