Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇట‌లీలో చాణ‌క్య ఏం చేస్తున్నాడు..?

Advertiesment
ఇట‌లీలో చాణ‌క్య ఏం చేస్తున్నాడు..?
, శనివారం, 31 ఆగస్టు 2019 (22:01 IST)
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `చాణక్య‌`. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం నేతృత్వాన‌ ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నారు. 
 
ఈ పాట‌ల చిత్రీక‌ర‌ణ షూటింగ్ విశేషాల‌ను అక్క‌డి లోక‌ల్ ఎల‌క్ట్రానిక్ మీడియా స్పెష‌ల్‌గా టెలికాస్ట్ చేయ‌డం విశేషం. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌.
 
గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి, కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, రైటర్: అబ్బూరి రవి, ఆర్ట్: రమణ వంక, కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ప్యాంటులో ఉన్న రెండు వేలు అడుగుతావేమోనని భయపడి చచ్చా