సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమాపై కోలీవుడ్ జనాల్లో అంచనాల డోస్ మాములుగా లేదు. చాలాకాలం తరువాత తలైవా పోలీస్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. 28 ఏళ్ల అనంతరం ఒక డిఫరెంట్ కాప్‌గా కనిపించబోతున్నాడు. మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్లో కొనసాగుతోంది.
మొన్నటివరకు జైపూర్లో నయనతారతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్న రజినీ ఇప్పుడు ముంబైలో భారీ సెట్స్ మధ్య తెరకెక్కించనున్న యాక్షన్ సీక్వెన్స్‌లో నటించడానికి సిద్దమవుతున్నాడు. సినిమాలో ఇదే ఫైనల్ షెడ్యూల్ అని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్‌ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఫినిష్ చేయాలనీ రజినీకాంత్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సినిమాను పొంగల్ కానుకగా రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు.