Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్జున్‌పై లైంగిక వేధింపులు.. శ్రుతి హరిహరణ్‌కు షాక్.. ఏమైంది..?

Advertiesment
అర్జున్‌పై లైంగిక వేధింపులు.. శ్రుతి హరిహరణ్‌కు షాక్.. ఏమైంది..?
, సోమవారం, 26 ఆగస్టు 2019 (15:03 IST)
యాక్షన్ కింగ్ అర్జున్ లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పించిన హీరోయిన్ శ్రుతి హరిహరణ్‌కు షాక్ ఎదురైంది. షూటింగ్ సందర్భంగా ఓ సన్నివేశాన్ని ఎలా చేయాలో వివరిస్తూ, తనను అసభ్యంగా తాకారని శ్రుతి హరిహరణ్‌కు ఆరోపించింది. అప్పట్లో ఆమె పోలీసులకు కూడా అర్జున్‌పై ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో చిత్ర పరిశ్రమ చేసిన ప్రయత్నాలకు కూడా ఆమె తలొగ్గలేదు. 
 
అనంతరం ఆమెపై అర్జున్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసులు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. తన తండ్రి పరువుకు శ్రుతి భంగం కలిగించిందంటూ అర్జున్ పిల్లలు ఆమెపై రూ.5కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అయితే, అర్జున్ పిల్లలు తనపై వేసిన కేసు చెల్లదంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆమెకు షాక్ ఇచ్చింది. పిటిషన్ చెల్లదంటూ కొట్టివేసింది.
 
కాగా.. బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపిన 'మీ టూ' ఉద్యమం కోలీవుడ్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్‌ తనను వేధించారని నటి శృతి హరిహరణ్‌ ఆరోపించడంతో తీవ్ర దుమారం రేగింది. శృతి ఆరోపణలను విని షాకయ్యానని.. అందులో నిజం లేదని అర్జున్ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. దీని వెనక కుట్ర ఉన్నట్లు అనిపిస్తోందని అర్జున్ గతంలో అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం... ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ సింధు