Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్..

Advertiesment
Sye Raa Narasimha Reddy
, మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (11:06 IST)
సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మారింది.  మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సంచ‌ల‌న చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి మెగాభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా అక్టోబర్-02న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుండటంతో.. ప్రి రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
 
అయితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మొదట కర్నూలు‌లో నిర్వ‌హించాలి అనుకున్నారు కానీ... అనివార్య కారణాల వల్ల హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం వేదికగా వేడుకలు జరగనున్నాయని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18న  ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే 18 నుంచి 22కు వాయిదా పడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అఖిలభారత చిరంజీవి యువత ఓ ప్రకటనలో తెలిపింది. 
 
అయితే ఇంతవరకూ దర్శకనిర్మాతలు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కాగా.. ఈ మెగా వేడుకకు ప్రత్యేక అతిథులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శధీరుడు రాజమౌళి, శివ కొరటాల, వీవీ వినాయక్ విచ్చేస్తారని చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మార్చారు కానీ.. ఎందుకు మార్చాల్సి వ‌చ్చింది అనేది మాత్రం తెలియ‌లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిస్కోరాజా కోసం రంగంలోకి హాలీవుడ్ టీమ్.. ఐస్ ల్యాండ్‌లో షెడ్యూల్