Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చంద్రముఖి'ని గుర్తుకుతెచ్చేలా... "స్వయంవద"

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (09:59 IST)
హారర్ చిత్రాల ట్రెండ్‌ను దక్షిణాది చిత్ర పరిశ్రమల్లోకి తిరిగి తీసుకొచ్చిన సినిమా "చంద్రముఖి". ఈ సినిమా సాధించిన ఘన విజయం మరెన్నో కొత్త హారర్ చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ క్రమంలో 'చంద్రముఖి'ని గుర్తుకుతెచ్చేలా రూపొందిన కొత్త సినిమా "స్వయంవద". ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా నటించారు. ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై రాజా దూర్వాసుల ఈ చిత్రాన్ని నిర్మించారు. సకుటుంబ కథా చిత్రంగా స్వయంవదను దర్శకుడు వివేక్ వర్మ తెరకెక్కించారు. 
 
సస్పెన్స్, హారర్, కామెడీ థ్రిల్లర్ తరహాలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ వర్మ మాట్లాడుతూ... స్వయంవద లాంటి మంచి టైటిల్ పెట్టినందుకే చాలా మంది అభినందిస్తున్నారు. ఫస్ట్‌లుక్, టీజర్‌లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూసిన వాళ్లంతా బాగుందని చెబుతున్నారు. సినిమా చూశాక కూడా ఇలాంటి ప్రశంసలే వస్తాయని ఆశిస్తున్నాం. 
 
ఇదొక విశిష్టమైన కథ. నాయిక పాత్ర ఆరు విభిన్న గెటప్‌లలో కనిపిస్తుంది. ప్రేక్షకులు మెచ్చే హారర్, థ్రిల్లర్, కామెడీలాంటి అన్ని అంశాలుంటాయి. కీలక పాత్రల్లో పేరున్న నటులు ప్రతిభావంతంగా నటించారు. సకుటుంబంగా చూసేలా ఎలాంటి ఇబ్బంది లేకుండా కథనం సాగుతుంది. గతంలో మనల్ని అలరించిన చంద్రముఖి చిత్రాన్ని గుర్తుకుతెచ్చేలా స్వయంవద ఉంటుంది. త్వరలో ఘనంగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించి... ఏప్రిల్ 26న సినిమాను అన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. 
 
ఈ చిత్రంలో అర్చ‌నా కౌడ్లీ, పోసాని కృష్ణ ముర‌ళి, ధ‌న్ రాజ్, సారికా రామ‌చంద్ర‌రావు, రాంజ‌గ‌న్, లోహిత్ కుమార్, ఆనంద చ‌క్ర‌పాణి, ఆర్తి మోహ్ రాజ్, హిమాంశ రాజ్, ఉమాంత క‌ల్ప‌,  సోనీ హేమంత్ మీన‌న్, బెంగుళూరు శివానీ, బేబి శ్రీశేష ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆర్ట్:  మోహ‌న్ జిల్లా, కెమెరా:  వేణు ముర‌ళీధ‌ర్.వి,  సంగీతం: ర‌మ‌ణ‌.జీవి, ఎడిటింగ్:  సెల్వ కుమార్, నిర్మాత‌:  రాజా దూర్వాసుల‌, క‌థ‌,మాట‌లు, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ వ‌ర్మ‌.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపైనే మాసిన బట్టలతో రొమాన్స్ చేసుకున్న యంగ్ లవర్స్.. ఎవరంటే? (video)

బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్స్!

తల్లికి ఇద్దరు భర్తలు.. పలువురితో సన్నిహిత సంబంధం.. నచ్చకే ప్రియుడితో కలిసి హత్య

వైజాగ్‌లో కాగ్నిజెంట్ కార్యాలయం... థ్యాంక్స్ చెప్పిన మంత్రి నారా లోకేశ్

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా రోగిపై లైంగిక దాడి.. మృతి.. ప్రారంభమైన దర్యాప్తు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments