Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పటికీ ఎప్పటికీ వుండే అలాంటి 'రుణం'... రివ్యూ రిపోర్ట్

అప్పటికీ ఎప్పటికీ వుండే అలాంటి 'రుణం'... రివ్యూ రిపోర్ట్
, శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (17:34 IST)
రుణానుబంధం... ఇది అంతా రుణానుబంధం.. అంటూ ఒకప్పుడు ఘంటసాల పాత పాటలో జీవితమే ఆవిష్కరించారు కవి. జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు తప్పవు. అవి ఎదిరించి సక్రమ మార్గంలో వెళ్ళేవాడే సరైన మనిషి. ఈ పాయింట్‌తో ఎన్నో చిత్రాలు తెలుగులో వచ్చాయి. తాజాగా 'రుణం' అనే చిత్ర కథ కూడా అటువంటిదే. 
 
బెస్ట్‌ విన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పైన భీమినేని సురేష్‌, జి.రామకష్ణారావు సంయుక్తంగా నిర్మించి ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదలైంది. అంతా కొత్తవారు నటించిన ఈ చిత్రం దాదాపు 50 పైచిలుకు థియేటర్లలో విడుదలైంది. ఇంతకుముందు కన్నడ, తెలుగులో చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్‌. గుండ్రెడ్డి దర్శకత్వం వహించారు. గోపికష్ణ, మహేంద్ర, షిల్పా, ప్రియా అగస్థ్యన్లు నటీనటులుగా నటించారు. మరి చిత్రం ఎలా ఉందో చూద్దాం.
 
కథ:
సుధీర్‌, శ్రీను రూమ్‌మేట్స్‌. తన సంపాదనలో కొంత తల్లిదండ్రులకు పంపిస్తుంటాడు. సుధీర్‌ అనాథ. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం ప్రియురాలు లతకు వెచ్చిస్తుంటాడు. ఆమె మోసం చేసిందని తెలుసుకున్నా సుధీర్‌ ఆవేశంలో ఎలాగైనా సరే డబ్బు ఈజీగా సంపాదించాలనే ఓ నిర్ణయానికి వస్తాడు. ఇందుకు ఆర్థిక పరిస్థితి సరిగ్గాలేని శ్రీనును కూడా ఇన్‌వాల్వ్‌ చేస్తాడు. కాగా, శ్రీను.. లతను ప్రేమిస్తాడు. 
 
ఆ తర్వాత కోటీశ్వరుడైన వెట్రి అనే వ్యక్తి అకౌంట్‌నుంచి 50 కోట్లు కొట్టాలని ప్లాన్‌ చేస్తాడు. దానివల్ల 25 కోట్లే వచ్చి సాప్ట్‌వేర్‌ ఆగిపోతుంది. వెంటనే ఈ విషయం వెట్రికి తెలిసి సుధీర్‌ ఎక్కడుందీ గుర్తించి ఎటాక్‌ చేస్తారు. ఆ గొడవలో శ్రీను చనిపోతాడు. చివరి కోరికగా తన అమ్మానాన్నను నువ్వే చూసుకోవాలంటూ సుధీర్‌తో హామీ తీసుకుంటాడు. ఆ తర్వాత ఏమయింది? సుధీర్‌ను వెట్రి ఏం చేశాడు? శ్రీను అమ్మానాన్నల పరిస్థితి ఏమిటి? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
ఇది ఇద్దరి వ్యక్తుల కథ. వారికి మానవీయ సంబంధాల్ని టచ్‌ చేసి దర్శకుడు రాసుకున్న కథ. సన్నివేశాల్లో భావోద్వేగాలను రక్తికట్టించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందుకు సంభాషణలు తోడయ్యాయి. సుధీర్‌ తను చేసిన తప్పును సమర్థించుకునే క్రమంలో వచ్చే మాటలకు 'చందమామరావే.. జాబిల్లిరావే.. అంటే చందమామ వస్తుందా.. అది బ్లాక్‌ మెయిల్‌ అయితే ఇదీ అంతే' అంటూ విశ్లేషించాడు. సెంటిమెంట్‌పరంగా జీవితంలో ఇబ్బందలున్నవారందరూ దురదృష్టవంతులు కాకపోవచ్చుకానీ. ఆ  బాధను పంచుకోవడానికి ఎవ్వరూలేనివారే దురదృష్టవంతులు' అంటూ సన్నివేశపరంగా వచ్చే సంభాషణలు బాగున్నాయి. అన్నీ తెలిసే మనిషి తప్పుచేస్తాడు. 
 
కానీ దాన్ని సమర్థించుకునేపనిలోనే వుంటాడు. ఈ కోణంలోపైనే కథంతా నడుస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం. 'కనిపెంచితేనే తల్లికాదు. ఆప్యాయతను పొందే ప్రతీ అమ్మ తల్లే.. అని హీరో పాత్ర సుదీర్‌ రుజువు చేశాడు. అలాగే అమాయకుల్ని ప్రేమ పేరుతో మోసం చేసే లత అనే వారుకూడా వున్నారంటూ జాగ్రత్త చెప్పాడు. ఇక కొన్ని కొన్ని సన్నివేశాలు హాస్యాన్ని బాగున్నా... మోతాదు మించినట్లుంది. సుధీర్‌ మామగా చేసిన పల్లెటూరి వ్యక్తి బుడ్డదిగే సన్నివేశాలు ఎంటర్‌టైన్‌ చేసినా కొంచెంది ఎక్కువగా అనిపిస్తుంది. 
 
నాయికలుగా నటించినవారు కొత్తవారయినా పాత్రకు న్యాయం చేశారనే చెప్పాలి. యాభైరూపాలు పోగొట్టుకున్నాను. దొరికితే ఇవ్వండని.. ఈమధ్య వాట్సప్‌లో వచ్చే వాటిని సీన్‌గా మార్చి తీశాడు. ముఖ్యంగా పుట్టి గుడ్డివారైన శ్రీను తల్లిదండ్రులు నటన బాగుంది. హీరో మహేంద్ర ప్రామినెంట్‌ రోల్‌ ప్లే చేశాడు. ఎమోషనల్‌ సీన్స్‌‌లో బాగా నటించాడు. హీరోయిన్‌ ప్రియా అందం అభినయంతో ఆకట్టుకుంది. విలన్‌ ప్రదీప్‌ పత్తికొండ విలనిజంలో బిల్డప్‌ బాగుంది. 
 
ముఖ్యంగా నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. దర్శకుడు మంచి మెసేజ్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు కృతంగా అనిపిస్తాయి. కోటీశ్వరుల అకౌంట్స్‌ హాక్‌ చేయడం, తల్లిదండ్రులు గుడ్డివారైనా కొడుకు ఎవరనేది చివరివరకు గుర్తించకపోవడం.. వంటివాటిల్లో చిన్న లాజిక్‌ మిస్‌ అయింది. ముక్కుమొహం తెలీని వ్యక్తి తన రుణం ఎలా తీర్చుకున్నాడనే ముగింపు చిత్రానికి బలమైన పాయింట్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియాలో స్టార్‌వార్ : నువ్వానేనా అంటూ పోటీపడుతున్న హీరోలు