Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోషల్ మీడియాలో స్టార్‌వార్ : నువ్వానేనా అంటూ పోటీపడుతున్న హీరోలు

Advertiesment
సోషల్ మీడియాలో స్టార్‌వార్ : నువ్వానేనా అంటూ పోటీపడుతున్న హీరోలు
, శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (15:40 IST)
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులకు చేరువగా ఉంటున్నారు. హీరోలు తమ ఫాలోవర్స్ సంఖ్యతో ఆధిక్యతను ప్రదర్శించుకుంటున్నారు. తమ సినిమాలకు సంబంధించిన విషయాలు, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అభిమానులు సైతం తమ హీరోకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారంటే తమ హీరోకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారంటూ పోటీపడుతున్నారు. 
 
ఫేస్‌బుక్, ట్విట్టర్‌తోపాటు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కూడా చేరింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అల్లూ అర్జున్ మూడు మిలియన్ ఫాలోవర్స్‌ని చేరుకున్నాడు. ఫేస్‌బుక్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న అల్లూ అర్జున్, ట్విట్టర్‌లో ఆరో స్థానంలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ ఎన్టీఆర్ ఆరవ స్థానంలో కొనసాగగా అల్లూ అర్జున్ ఏడవ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఎన్టీఆర్‌ని వెనక్కు నెట్టి ఆరవ స్థానంలోకి వచ్చాడు. 
 
ఇప్పుడు ఎన్టీఆర్ ఏడో స్థానానికి దిగజారాడు. కొన్ని నెలల క్రితం అల్లూ అర్జున్ మూడు మిలియన్ ఫాలోవర్స్‌ని చేరుకున్నాడు. ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు. ప్రిన్స్‌కి 7.5 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. రెండో స్థానంలో 5.7 మిలియన్‌ల ఫాలోవర్స్‌తో నాగార్జున, మూడో స్థానంలో 5.5 మిలియన్లతో రానా, నాలుగో స్థానంలో 3.5 మిలియన్లతో పవన్ కళ్యాణ్, స్వల్ప తేడాతో అయిదవ స్థానంలో 3.2 మిలియన్‌లతో నాని ఉండగా 3 మిలియన్‌లతో అల్లు అర్జున్ ఉన్నాడు. 
 
2.98 మిలియన్‌లతో ఎన్టీఆర్ ఏడో స్థానంలో ఉన్నాడు. అల్లు అర్జున్ క్రేజ్ చూస్తుంటే, మరికొన్ని వారాల్లో నానీని, పవన్ కళ్యాణ్‌ని మించిపోయి నాలుగో స్థానాన్ని చేరుకునే అవకాశం లేకపోలేదు. బన్నీ ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ కారణంగానే టాప్-5లోకి చేరే అవకాశం ఉందని అభిప్రాయం. అల్లు అర్జున్‌కి మలయాళం, ఉత్తరాదిన కూడా ఫాలోవర్స్ అధికంగా ఉన్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయితేజ్ 'చిత్రలహరి' అలా వాయించేశాడు... రివ్యూ రిపోర్ట్