Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగార్రాజుపై క్లారిటీ ఇచ్చిన చైత‌న్య..‌. ఇంత‌కీ ఏం చెప్పాడు..?

Advertiesment
బంగార్రాజుపై క్లారిటీ ఇచ్చిన చైత‌న్య..‌. ఇంత‌కీ ఏం చెప్పాడు..?
, సోమవారం, 15 ఏప్రియల్ 2019 (22:48 IST)
నాగార్జున కెరీర్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా 50 కోట్ల‌కు పైగా షేర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి సీక్వెల్ చేయాల‌నుకోవ‌డం... బంగార్రాజు అనే టైటిల్ ఫిక్స్ చేయ‌డం తెలిసిందే. అయితే... టైటిల్ ఫిక్స్ అయ్యింది కానీ.. క‌థ నాగార్జున‌ను సంతృప్తిప‌ర‌చ‌క‌పోవ‌డంతో చాలా క‌స‌ర‌త్తులు చేసి ఆఖ‌రికి మెప్పించారు. 
 
అయితే... ఈ సినిమాలో నాగార్జున‌తో పాటు నాగ చైత‌న్య కూడా న‌టించ‌నున్నాడు అని వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల ఈ సినిమాలో నాగ చైత‌న్య కాకుండా అఖిల్ న‌టించ‌నున్నాడు అంటూ ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో బంగార్రాజులో న‌టించేది నాగ చైత‌న్యా..? అఖిలా..? అనే డౌట్ అందరిలో వ‌చ్చింది. 
 
ఈ డౌట్‌కి చైతు క్లారిటీ ఇచ్చేసాడు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... మ‌జిలీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా రీసెంట్‌గా మీడియాతో మాట్లాడిన చైత‌న్య‌.. బంగార్రాజు త‌ను న‌టిస్తున్న‌ట్టు చెప్పాడు. జులై నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు. అదీ..సంగ‌తి..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త‌మిళ హీరో ధ‌నుష్ పైన తెలుగు హీరో న‌వీన్ చంద్ర కామెంట్ చేయ‌డానికి కార‌ణం..?