Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకీ మామ ఎంతవ‌ర‌కు వ‌చ్చారు?

Advertiesment
వెంకీ మామ ఎంతవ‌ర‌కు వ‌చ్చారు?
, మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (20:48 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైతన్య కాంబినేష‌న్లో జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ తెర‌కెక్కిస్తోన్న భారీ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌.  ఈ సినిమాని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవ‌ల రాజ‌మండ్రి స‌మీపంలోని రాజోలు ప‌రిస‌ర ప్రాంతాల్లో ఫ‌స్ట్ షెడ్యూల్‌లో షూటింగ్ జ‌రుపుకుంది. వెంకీ - చైతు ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. వెంకీ ఇందులో రైస్ మిల్లు ఓన‌ర్‌గా న‌టిస్తుంటే... చైతు మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. 
 
వెంకటేష్ కుమార్తె పెళ్ళి కారణంగా.. షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు పెళ్ళి హ‌డావిడి పూర్తి కావ‌డంతో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ నెల 8 నుంచి సెకండ్ షెడ్యూల్ ప్రారంభించనున్నారు. హైద‌రాబాద్ లోనే ఈ తాజా షెడ్యూల్ ఉంటుంద‌ని తెలిసింది. 
 
జులై చివ‌రివ‌ర‌కు బ్రేక్ లేకుండా నాన్ స్టాప్‌గా షూటింగ్ జ‌రుపుకోనుంది. వెంక‌టేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, చైత‌న్య స‌ర‌స‌న రాశీ ఖన్నా నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనెర్‌గా అంద‌రికీ న‌చ్చేలా ఈ సినిమా రూపొందుతోంది. ఎస్.ఎస్.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌న్మ‌థుడు 2 ఫ్యామిలీ ఇదే... సన్సేషన్ క్రియేట్ చేస్తారా?