Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ అవతారంతో విజయ్ దేవరకొండ న్యూ లుక్

డీవీ
గురువారం, 9 మే 2024 (10:26 IST)
devarakonda mass look
నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. విశాఖ పట్నం లో దిల్ రాజు, శిరీష్,  డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా మూవీ అనౌన్స్ మెంట్ షూటింగ్ జరుగుతుంది. ఈరోజు విజయ్ దేవరకొండ కత్తి తో చేయి కనిపించే లుక్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. 'రాజా వారు రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ చిత్రమిది. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందనుంది.
 
ఈ రోజు విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాను ప్రకటించారు. అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ కత్తి పట్టుకుని, వయలెంట్ మోడ్ లో ఉన్నట్లు చూపించారు. 'కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే..' అనే క్యాప్షన్ రాశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు తెలియజేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments