Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

బ్రహ్మానందం ఏడిపిస్తే చూశాం, ఈసారి గెటప్ శ్రీను చేయబోతున్నారు : తేజ సజ్జా

Advertiesment
Teja Sajja,  Getup Srinu, Ankita Kharat

డీవీ

, సోమవారం, 6 మే 2024 (10:33 IST)
Teja Sajja, Getup Srinu, Ankita Kharat
గెటప్ శ్రీను  'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, రాజు యాదవ్ చూడు, థిస్ ఈజ్ మై దరిద్రం పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజుయాదవ్ మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సూపర్ హీరో తేజ సజ్జా ముఖ్య అతిధిగా హాజరై ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
 
 హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. శ్రీనుగారు జాంబిరెడ్డి చిత్రం నుంచి పరిచయం. తను విలక్షణమై నటుడు. జాంబిరెడ్డిలో కళ్ళు మూసుకొని నటించారు. హనుమాన్ లో పళ్ళ సెట్ పెట్టుకొని నవ్వించారు. ఏదైనా ఒక సమస్య వుంటే ఆయన అద్భుతంగా నటిస్తారు. రాజు యాదవ్ లో నవ్వుతూనే వుండాలనే సమస్య వుంది. ఖచ్చితంగా అదరగొట్టివుంటారు. ఇది చాలా మంచి కథ. ఒక అర్ధవంతమైన సినిమాకి కామెడీ జోడిస్తే అది పెద్ద సినిమా అవుతుంది. అర్ధవంతమైన ఎమోషన్స్ తో మీనింగ్ ఫుల్ మూవీ ఇది. ఇలాంటి సినిమా చేసిన టీం అందరికీ అల్ ది బెస్ట్. శ్రీను గారు చాలా మంచి వ్యక్తిత్వం వున్న మనిషి. సినిమా కోసం అహర్నిశలు కష్టపడతారు. పక్కన వున్న నటులని కూడా సపోర్ట్ చేస్తారు. కామెడీ చేయడం కష్టమైన పని. కామెడీ చేసే వాళ్ళు ఏడిపిస్తే ఎంత అద్భుతంగా వుంటుందో బ్రహ్మానందం గారు చేస్తే ఒక సారి చూశాం. ఈసారి గెటప్ శ్రీను చేయబోతున్నారు. ఇది నవ్విస్తూ మనసుని హత్తుకునే చిత్రం. సినిమా యూనిట్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
 
హీరో గెటప్ శ్రీను మాట్లాడుతూ, ఈ సినిమా జర్నీలో తేజ గారు ఎంతగానో ప్రోత్సహించారు. దర్శకుడు కృష్ణమాచారి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తన కష్టానికి తగిన ఫలితం తప్పకుండా దొరుకుతుంది. మే17న మీ అందరి దీవెనలు కావాలి. ఉదయ్ చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. సురేష్ బొబ్బిలి అద్భుతమైన నేపధ్య సంగీతం అందించారు. నిర్మాత ప్రశాంత్ గారు చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే17న అందరూ రాజు యాదవ్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
 
దర్శకుడు కృష్ణమాచారి.. తేజ గారు సినిమా మొదలైనప్పటినుంచి మాకు సపోర్ట్ చేస్తూనే వున్నారు. తేజ గారు,  పూరి జగన్నాథ్ గారు, ప్రశాంత్ వర్మ గారు మేము అడగకముందే సినిమా నుంచి ఏది రిలీజ్ అయిన పోస్ట్ చేస్తుంటారు. వారి సపోర్టుకు ధన్యవాదాలు. ఈ సినిమా ఒక రియల్ స్టొరీ. చాలా సహజసిద్ధంగా ఈ సినిమాని తీశాం. ప్రేక్షకులు కొత్త అనుభూతి వుంటుంది. ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ ఆకట్టుకుంటాయి. మే17న అందరూ రాజు యాదవ్ చూసి సినిమాని పెద్ద హిట్ చేయాలి. ఫ్యామిలీ అంతా కలసి చూసే సినిమా ఇది' అన్నారు.
 
హీరోయిన్ అంకిత ఖరత్ మాట్లాడుతూ... ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో కామెడీ రోమాన్స్ ఎమోషన్స్ అన్నీ వున్నాయి. తప్పకుండా సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ వేడుకు విచ్చేసిన తేజసజ్జా గారికి కృతజ్ఞతలు' తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మారుతీ టీమ్ ప్రెజెంట్స్, చీర కట్టే వృత్తి చేసే రాజ్ తరుణ్ చిత్రం భలే ఉన్నాడే