Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్ ఆనందంలో పార్టీ చేసుకున్న అల్లు అర్జున్ !

Advertiesment
Allu Arjun, sukumar,  dil raju

డీవీ

, బుధవారం, 8 మే 2024 (12:32 IST)
ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్ గత రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఒకవైపు హైదరాబాద్ అంతా ఈదురుగాలులు, భారీ వర్షం కురుస్తుండగా మాదాపూర్ లోని ఓ హోటల్ లో అల్లు అర్జున్ పార్టీ చేసుకుని ఆర్య షూట్ టైములో జరిగిన సంఘటన గుర్తుచేసుకున్నారు. 
 
webdunia
Sukumar, arjun
వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ,  రోజుకు మూడు కథలు వింటున్నా. నా మ్యాజిక్ ఎక్కడా తగలడం లేదు. యాక్టర్ తరుణ్ ఓ రోజు పిలిచాడు. దిల్ రాజు సినిమా వేస్తున్నారు. చూద్దాం అన్నారు.ఆ తర్వాత కథ చెప్పారు.  నాకు మైండ్ బ్లోయింగ్ లా అనిపించింది. .అంతకుముందు ఇడియట్ సినిమా చూసా. ఇలాంటి సినిమా చేయాలి. అనుకున్నాను. ఇక సుకుమార్ కథ చెప్పగానే ది ఈజ్ మై ఇడియట్ అనుకున్నా. 
 
అప్పుడు  నేను కొత్త. నాపై  రూపాయి వస్తందనే గ్యారంటీలేదు. సుకుమార్.కూడా  కొత్త. నాకు మాత్రం గట్ ఫీలింగ్ వుంది. కానీ అందరూ నమ్మితేనే సినిమా వస్తుంది. సుకుమార్ లో మ్యాజిక్ కనిపించింది. ఇందుకు వినాయక్ కు థ్యాక్ చెప్పాలి. మా డాడీని నన్ను కలిసి మీరు తీయండి. నన్ను నమ్మండి. ఆ కుర్రాడు (సుకుమార్) తీయగలడు. ఆరోజు వినాయక్ మాట అన్నబట్టే మేం తీయగలిగాం. ఆయన సరిగ్గాతీయలేదనుకుంటే నేనే తీస్తా అని వినాయక్ అన్నారు
 
వారం రోజులు ట్రయిల్ షూట్ చేశాం.  దాన్ని బాగోకపోతే వద్దనుకున్నాం. టెక్నికల్ టీమ్  కు చుపించాము. చూసి అద్భుతంగా తీశారు అన్నారు. ఇక దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఇష్టం. నేను  డాన్స్ బాగా చేస్తా. అందుకే నా డాన్స్ మార్క్ కోసం ఎదురుచూస్తుండగా,. తకదినతోం.. అనే పాట.. వచ్చింది. డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పార్టీ చేసుకున్నాం. తెల్లారి దిల్ రాజు షూట్ అన్నారు. నేను షాక్ అయ్యాను. కనీసం నిద్ర సరిగ్గా లేదు అన్నాను. కానీ పట్టుదలతో డాన్స్ చేయించారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అని తెలిపారు. అందుకే ఈరోజుకూడా పార్టీ చేసుకుందాం అంటూ.. ఆర్య ఇరవై ఏళ్ళ వేడుకలో పరిమిత టీమ్ సభ్యులతో హ్యాపీగా పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీ అయ్యేసరికి అర్థరాత్రి రెండు గంటలయింది. ఇదే టైమ్ ఇదే సీన్.. ఆర్య పాట చేయాలన్నప్పుడు జరిగిందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్ హాసన్ థగ్ లైఫ్ లో సిలంబరసన్ టిఆర్ (శింబు) ఎంట్రీ ఇచ్చాడు